Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబుకు గుండె ఆపరేషన్ చేయించిన సోనూసూద్

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (13:42 IST)
sonusood mumabi
సోనూసూద్ మరోసారి దాతృత్వం చాటుకున్నాడు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న చేస్తున్న సేవ‌లు మామూలువి కావు. తెలంగాణాలోనూ, ఆంధ్ర‌లోనూ ఆక్సిజ‌న్ ను పేషెంట్ల‌ను అంద‌జేసేలా టీమ్‌ను ఏర్పాటు చేసుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఓ చంటిబాబుకు గుండె ఆప‌రేష‌న్ ముంబైకు ర‌ప్పించి చేయించారు.
 
ఖమ్మం జిల్లాకు చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతులకు ఈ ఏడాది ఓ బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టుకతోనే గుండెల్లో సమస్య ఏర్పడింది. దీనిని గుర్తించిన వైద్యులు.. ఆపరేషన్ చేసేందుకు రూ. ఆరు లక్షలు ఖర్చు అవుతాయని తెలిపారు. కృష్ణ ఓ ప్రైవేటు ఉద్యోగి కావడంతో చిన్నారి వైద్యం కోసం అంత డబ్బు లేకపోవడంతో తల్లడిల్లిపోయాడు. 
 
ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తిరువూరులో ఉన్న జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు తెలుసుకుని సినీనటుడు సోనూసూద్‌కు తెలిపారు. దీనిపైన వెంటనే స్పందించిన సోనూసూద్..వారిని ముంబై రప్పించుకున్నారు. ముంబై లోని  వాడియా ఆస్పత్రిలో ఆ బాబుకు శనివారం గుండె ఆపరేషన్‌ చేయించారు. ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం కూడా బాగుందని వైద్యులు వెల్లడించారు. వెంటనే స్పందించి చిన్నారికి ఊపిరి పోసినందుకు గాను సోనూసూద్ కి కృష్ణ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments