Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా బిడ్డకు కారు గిఫ్టుగా ఇవ్వలేదు.. జస్ట్ టెస్ట్ రన్ : సోనూసూద్

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (12:55 IST)
కరోనా కష్టకాలంలో దేశంలోని అనేక లక్షలమందికి ఆపద్బాంధవుడుగా మారిన రియల్ హీరో, సినీ నటుడు సోనూసూద్ తన కుమారుడికి రూ.3 కోట్ల విలువైన కారును కొనిచ్చినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. త‌న కొడుకు ఇషాన్‌కు రూ.3 కోట్ల విలువైన‌ కారుని ఫాద‌ర్స్ డే గిఫ్ట్‌గా సోనూసూద్ కొనిచ్చారంటూ ఈ ప్రచారం సాగుతోంది. అందులో కుటుంబ స‌భ్యుల‌తోనూ క‌లిసి తిరిగార‌ని వార్త‌లు వ‌చ్చాయి.
 
ఈ వార్తలపై సోనూసూద్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. వైర‌ల్ అవుతోన్న‌ ఫొటోల్లో కనిపిస్తోన్న కారుని ట్ర‌యల్స్ కోసం తీసుకొచ్చామ‌ని వివ‌రించారు. అయినా, ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా పిల్ల‌లు తండ్రికి గిఫ్ట్ ఇస్తారు కానీ, ఎక్క‌డైనా తండ్రి పిల్ల‌ల‌కి గిఫ్ట్ ఇస్తాడా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 
 
పిల్లలు, ఫ్యామిలీతో తాను సమయం గడిపితే చాలని, అదే వాళ్లకు ఇవ్వగలిగే పెద్ద బహుమతి అని చెప్పారు. వాళ్లతో సమయం గడపడానికి వీలు దొరకడం లేదని అన్నారు. భార్య, పిల్ల‌ల‌తో కలిసి కేవలం టెస్ట్‌ రన్‌కు వెళ్లానని తెలిపారు. 
 
త‌న కుమారుడు ఇషాన్‌కి కారు కొనుగోలు చేసినట్లు వచ్చిన‌ వార్తల్లో నిజం లేదని తెలిపారు. న‌కిలీ వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో కొంద‌రు త‌న‌పై విమ‌ర్శ‌లు చేశార‌ని చెబుతూ, అటువంటి స‌మ‌యంలోనూ త‌నకు అండ‌గా నిల‌బ‌డుతున్న‌వారికి థ్యాంక్స్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments