Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లోకి రాను.. వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేస్తా : సోనూ సూద్

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (10:31 IST)
తనకు ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అస్సలు లేదని బాలీవుడ్ విలన్ నటుడు, రియల్ హీరో సోనూ సూదా స్పష్టం చేశారు. అయితే, ప్రతి రాష్ట్రంలోనూ వృద్ధాశ్రమం, ఉచిత పాఠశాల ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడలో ఉన్న ది పార్క్ హోటల్‌‍లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 
 
"నాకు ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. నా జీవిత లక్ష్యం వేరే. ప్రతి రాష్ట్రంలోనూ వృద్దాశ్రమం, ఉచిత పాఠశాల ఏర్పాటు చేయడమే నా లక్ష్యం" అని  స్పష్టం చేశారు. తాను ఇప్పటివరకు ఏడున్నర లక్షల మందికి సాయం చేశానని, వారిలో 95 శాతం తాను చూడలేదని చెప్పారు. 
 
తన భార్య తెలుగు మహిళ అని, తన సేవలకు ఆమె కుటుంబం నుంచి పూర్తి సహకారం లభిస్తుందని సోనూసూద్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఫిక్కీ ఛైర్‌పర్సన్ శుభ్రా మహేశ్వరి అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అలాగే, తనకు ఎదురైన పలు ఘటనలను వారితో పంచుకున్నారు.

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments