Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పెళ్లికి రెడీ...ఆయన భార్య అంగీకరిస్తే మాజీ భర్త చిత్రాల్లో నటించేందుకు సోనియా సై...

Webdunia
మంగళవారం, 7 జులై 2015 (11:30 IST)
కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా వెలిగిన అందాల తార సోనియా అగర్వార్. 7జీ రెయిన్ బో కాలనీ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన సోనియాకు ఆ చిత్రం మంచి హిట్టునే అందించింది. ఆ చిత్రం తెలుగులో 7జీ బృందావనం కాలనీ పేరుతో విడుదలైన విజయం సాధించింది. దీంతో సోనియా తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా కొన్ని చిత్రాలు హిట్టు కొట్టాయి.
 
మంచి పీక్‌లో ఉండగానే సోనియా హీరో ధనుష్ సోదరుడైన దర్శకుడు సెల్వరాఘవన్‌ని వివాహం చేసుకుంది. అయితే కొన్ని రోజులకే మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సెల్వరాఘవన్ మరో పెళ్లి చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటూ వస్తున్న సోనియా రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటోంది.
 
ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. సెల్వరాఘవన్‌తో మనస్పర్థలు, ఆ తర్వాత విడాకులు పొందడం వంటి కారణాలతో మనసు తీవ్రంగా గాయపడింది. అయితే కాలం ఎంతటి గాయాన్ని అయినా మాన్పిస్తుంది. అలా ప్రస్తుతం పాత గాయాలు మానిపోవడంతో తాను కూడా మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపింది. 
 
అంతేకాదు.. దర్శకుడు సెల్వరాఘవన్ భార్యకి అభ్యంతరం లేకపోతే ఆయన సినిమాల్లో నటించడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదనీ, అలాగే ఆయన సోదరుడైన ధనుష్ సినిమాల్లో నటించడానికి కూడా తనకి ఎలాంటి ఇబ్బంది లేదని సోనియా స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే 'టెంపర్' సినిమా తరువాత ఆమెకి తెలుగులో అవకాశాలు బాగానే వస్తున్నట్టు సమాచారం. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments