Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియా ఓవరాక్షన్... డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది నేను కాదు..

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (09:14 IST)
మీడియాలో సినీ నటి సోనియా అగర్వాల్ తీవ్రంగా మండిపడ్డారు. మీడియా ఓవరాక్షన్ చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్తతో పాటు ఫోటోను ప్రచురించేముందు నిజానిజాలను తెలుసుకోవాలని హితవు పలికారు. 
 
కన్నడ చిత్ర సీమలో డ్రగ్స్ కలకలం రేపిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ చిత్ర సీమకు చెందిన రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలు డ్రగ్స్ కేసులో అరెస్టై ప్రస్తుతం బెయిల్‌పై విడుదలై వున్నారు. 
 
ఈ క్రమంలో కర్నాటకకు చెందిన సోనియా అగర్వాల్ అనే మోడల్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో వారిని చూసి భయపడిన ఆమె బాత్రూంలో దాక్కున్నట్టు వార్తలు వచ్చాయి. 
 
సోనియా ఇంట్లో డ్రగ్స్ లభించడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ వార్తను ప్రచురించిన కొన్ని మీడియా వెబ్‌సైట్లు.. మోడల్ సోనియా ఫొటో బదులుగా సినీ నటి సోనియా అగర్వాల్ ఫొటో వాడేశాయట. కొన్ని వెబ్‌సైట్లు అయితే మరింత అత్యుత్సాహం ప్రదర్శించి అసలు హీరోయినే డ్రగ్స్ కేసులో ఇరుక్కుందని ప్రచురించాయి. 
 
ఈ విషయం హీరోయిన్ సోనియా చెవికి చేరడంతో ఆమె మండిపడ్డారు. '7జీ బృందావన్ కాలనీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఆమె.. తనపై వస్తున్న వార్తలను తప్పుబట్టారు. ఈ వార్తలు ప్రచురించిన మీడియా సంస్థలు, జర్నలిస్టులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈమె కోలీవుడ్ దర్శకుడు సెల్వరాఘవన్‌ను పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments