మైక్ పట్టుకుంటేనే వల్లమాలిన ప్రేమ ఒలకపోవడమే ఇండస్ట్రీ తీరు.. తేల్చి చెప్పిన ఎస్.వి. రంగారావు

డీవీ
శుక్రవారం, 26 జులై 2024 (16:05 IST)
SV Rangarao
మైక్ పట్టుకుంటే తాతగారిపై ప్రేమ పొంగుతుంది - కానీ ఎదురుపడితే పట్టించుకోరు అదే ఇండస్ట్రీ తీరు అని ఎస్.వి.రంగారావు మనవడు రంగారావు తెలియజేశారు. తాతగారిపేరునే మనవడికి తల్లిదండ్రులు పేరు పెట్టారు. ఎస్.వి. రంగారావు అంటే సినిమా రంగంలో తెలియంది కాదు. చెన్నైలో నివాసం వుంటున్న రంగారావును ఓ విలేకరి కదిలిస్తే అప్పటి సంగతులు తెలియజేశారు. 2005 లోనే సినిమా రంగంలోకి వచ్చా. కానీ అనుకున్నంత ఈజీగాదు అని అర్థమైంది అని అన్నారు.
 
తాతగారు ఎస్.వి. రంగారావు గురించి అందరికీ తెలిసిందే. ఎంతోమందిని సాయం చేశారు తాతగారు. మా తాతగారు బతికున్నటైంలో ఎంతోమంది ఇంటికి వచ్చేవారు. అందులో మా బంధువులు కొందరు ఇప్పుడు దర్శకులుగా వున్నారు. కానీ వారిని కలిసి నేను నటుడిగా చేయాలనుందంటే ఏవో మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు. కొందరు చూద్దాం. చేద్దాం. టచ్ లో వుండూ అంటూ వాయిదా వేసేవారు. అయితే అందులో ఎన్. శంకర్ కి మా తాతగారితో అనుబంధం వుంది. ఆయనతో నా కోరిక చెప్పాను. కొంతకాలానికి జైబోలో తెలంగాణ సినిమాలో ఓ వేషం ఇచ్చారు. 
 
ఇక మా తాతగారి జయంతినాడు కానీ, వర్థంతి రోజునాడు కానీ సభ పెడితే మైక్ పట్టుకుని తాతగారిని ఇంద్రుడు చంద్రుడు అంటూ వాక్ చాతుర్యం చూపుతారు. అలా మాట్లాడిన వారిలో దర్శకులు చాలామంది వున్నారు. ఆ తర్వాత నేను వెళ్ళి వారి ఆఫీస్ లో వేషం గురించి అడిగి, మా తాతగారి పేరు చెబితే.. నిన్ననే ఒకరు వచ్చారు. ఆయన ఒరిజినల్లా, మీరు ఒరిజినల్లా.. తెలుసుకోండన్నారు. మరొకరు దగ్గరికి వెళితే, టచ్ లో వుంటూ అన్నారు. ఇంకొందరైతే తాతగారిలా వేషం వేసుకుని డైలాగ్ చెప్పగలవా? అని అడిగారు. ఇలా చాలామంది దర్శకులను కలిశాను. ఎక్కడా సరైన అవకాశం రాలేదు అని తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఇండస్ట్రీలో పెద్దదిక్కు లేనిదే అవకాశాలు లేవని స్పష్టంగా అర్థమైందని తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

High alert: ఎర్రకోట సమీపంలో పేలుడు.. పది మంది మృతి.. హైదరాబాదులో అలెర్ట్

APCRDA: నవంబర్ 14-15 తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సమ్మిట్

Nalgonda: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. 29మంది ప్రయాణీకులు ఏమయ్యారు? (video)

కడప జిల్లా క్వారీ బ్లాస్టింగ్.. ఇంటి పైకప్పు కూలి మహిళ మృతి

Jubilee Hills Bypoll Live: జూబ్లీహిల్స్ అసెంబ్లీ పోలింగ్.. కట్టుదిట్టమైన భద్రత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

తర్వాతి కథనం
Show comments