మిస్టర్ ప్రెగ్నెంట్ సాంగ్‌లో సోహైల్, రూపా కెమిస్ట్రీ ఆకట్టుకుంది

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (15:56 IST)
Mr. Pregnant song launch
‘బిగ్ బాస్’ ఫేమ్, హీరో సయ్యద్ సోహైల్ రియాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’.  రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్‌లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలోని పాటలు మంచి ఆదరణ పొందుతున్నాయి. 
 
ఇటీవల కథ వేరుంటది పాట విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రంలోని మరో పాట హే చెలి లిరికల్ సాంగ్ ను క్రేజీ హీరో విశ్వక్ సేన్ విడుదల చేశారు. హే చెలి పాట ఎలా ఉందో చూస్తే..హే చెలి అడిగానే కౌగిలి, తీయగా తీరాలి ఈ చలి, హే సఖి విరహాలు దేనికి, చేరవా అడుగేసి చెంతకి. నీ మాటలో తీపి, ఏ తాపమో రేపి నీ చూపు చేజాపి నా చూపునే ఆపి..వర్షం గొడుగూ జంట, దారీ అడుగూ జంట..నువ్వూ నేనే నంట, ప్రేమా కవితే, ఒకరే ఒకరై మనమే ఒకటే పయనం మనమే, విడిగా అడుగే పడని జతగా మనమే..అంటూ సాగుతుందీ పాట. ఈ రొమాంటిక్ గీతంలో సోహైల్, రూపా కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. శ్రావణ్ భరద్వాజ్ స్వరపర్చిన హే చెలి పాటకు శ్రీమణి సాహిత్యాన్ని అందించగా..అనురాగ్ కులకర్ణి పాడారు.
 
హీరో సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రంలో ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడు. తుది దశలో ఉన్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
 
నటీనటులు :  సయ్యద్ సొహైల్ రియాన్, రూపా కొడువయుర్, సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు 
 
సాంకేతిక నిపుణులు : సినిమాటోగ్రఫీ - నిజార్ షఫీ, సంగీతం - శ్రావణ్ భరద్వాజ్, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, ఆర్ట్ - గాంధీ నడికుడికర్, బ్యానర్ - మైక్ మూవీస్, పీఆర్వో - జీఎస్కే మీడియా, నిర్మాతలు - అప్పి రెడ్డి, రవిరెడ్డి సజ్జల, రచన-దర్శకత్వం - శ్రీనివాస్ వింజనంపాటి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments