భలే ఉన్నాడే చిత్రంలో రాజ్ తరుణ్, హైపర్ ఆది టీంపై సోఫియా సాంగ్

డీవీ
సోమవారం, 26 ఆగస్టు 2024 (18:02 IST)
Raj Tarun, Hyper Aadi
రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ 'భలే ఉన్నాడే'. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
 
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ మూవీ నుంచి 'సోఫియా' సాంగ్ ని లాంచ్ చేశారు. హార్ట్ బ్రోకెన్ బాయ్స్ అందరికీ డెడికేట్ చేసిన ఈ నెంబర్ ని శేఖర్ చంద్ర చాలా క్యాచిగా కంపోజ్ చేశారు.
 
శేఖర్‌చంద్ర, దేవ్ రాసిన లిరిక్స్ కి కరీముల్లా వోకల్స్ చాలా ఎడిక్టివ్ గా వున్నాయి. ఈ సాంగ్ లో రాజ్ తరుణ్ డ్యాన్స్ మూవ్స్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం స్పెషల్ ఈ సాంగ్స్ ట్రెండింగ్ లో వుంది.    
 
ఈ చిత్రానికి నగేష్ బానెల్లా డీవోపీగా పని చేస్తున్నారు. శ్రీకాంత్ పట్నాయక్ ఆర్ ఎడిటర్, సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్, శివ కుమార్ మచ్చ ప్రొడక్షన్ డిజైనర్. బి గోవిందరాజు, ముక్కర మురళీధర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
 
వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.
 
తారాగణం: రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్, సింగీతం శ్రీనివాస్, అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్, వీటీవీ గణేష్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, రాచా రవి, సుదర్శన్, శ్రీనివాస్ వడ్లమాని, మణి చందన, పటాస్ ప్రవీణ్ తదితరులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telugu Love: అబ్బా.. ఎంత బాగా తెలుగు మాట్లాడారు.. కృతికా శుక్లాపై పవన్ ప్రశంసలు

ఏలూరు: అర్థరాత్రి తలుపులు పగలగొట్టి యువతిపై ఇద్దరు రౌడీషీటర్లు అత్యాచారం

Somireddy: జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. సోమిరెడ్డి డిమాండ్

Janasena: పవన్ దిష్టి కామెంట్స్... వివరణ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments