Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్యాణ్ రామ్ విడుదల చేసిన స్లమ్ డాగ్ హస్బెండ్ ట్రైలర్

Webdunia
గురువారం, 29 జూన్ 2023 (16:17 IST)
Kalyan Ram, Slum Dog Husband team
పిట్ట కథ సినిమాతో తెరంగేట్రం చేసిన యువ నటుడు సంజయ్ రావ్ "స్లమ్ డాగ్ హస్బెండ్" అనే కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఈ హీరో నటించిన పిట్ట కథ సినిమా వైవిద్యమైన థ్రిల్లర్ గా వచ్చి అప్పట్లో అందరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రాబోతున్న ఈ చిత్రం కూడా వైవిధ్యమైన కామెడీ ఎంటర్టైనింగ్ కథతో రాబోతోంది అని ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.
 
స్లమ్ ఏరియాలో ఉండే ఒక అమ్మాయి,అబ్బాయి, పెళ్లి కోసం తాపత్రయం పడే సీన్లతో ట్రైలర్ స్టార్ట్ కాగా, ఆ తరువాత ఈ ట్రైలర్ మొత్తం చాలా డిఫరెంట్ గా కొనసాగింది. ఆ అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అంటే ఆ అబ్బాయికి ఒక గండం ఉందడంతో తాను ఆ కారణం వల్ల మొదటిగా కుక్కని పెళ్లి చేసుకోవడం, ఇక కుక్కని పెళ్లి చేసుకున్నాక ఆ గంధం గట్టెక్కింది అనే నమ్మకంతో హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కోర్టులో మొదటి భార్య (కుక్క) బతికి ఉండగా రెండో భార్యని ఎలా చేసుకుంటారు అని కేసు పెట్టడంతో ఈ ట్రైలర్ మరింత ఆసక్తిగా మారింది. ఇక ఈ ట్రైలర్ చూశాక ప్రేక్షకులకు ఇది వింతగా అనిపియ్యదమే కాకుండా ఎక్సైట్మెంట్ ని కూడా పెంచేయడం ఖాయం. ముఖ్యంగా ట్రైలర్ మొత్తం మంచి కామెడీ తో కూడి, ఆధ్యాంతం ఈ సినిమా ప్రేక్షకులను చూసినంత సేపు నవ్విస్తూ ఉంటుంది అనే క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాదు ఈ ట్రైలర్ లో బ్రహ్మాజీ, సప్తగిరి అలానే ఆలీ లాంటి వాళ్ళు మంచి కామెడీని పండించారు.
 
సరైన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాకి ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించగా, మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పి రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక సినిమా మేకర్స్ త్వరలోనే త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గోదాములో 3708 బస్తాల బియ్యం మాయం: అరెస్ట్ భయంతో పేర్ని నాని అజ్ఞాతం?

Chandrababu: సభ్యత్వ నమోదులో 7.3 మిలియన్లు.. పార్టీ సరికొత్త రికార్డ్- చంద్రబాబు

Bengaluru: భార్య, అత్తారింటి వేధింపులు.. హెడ్ కానిస్టేబుల్‌ రైలు కింద పడి ఆత్మహత్య

Rahul Gandhi: కుల గణన, రిజర్వేషన్లపై ప్రధాని మోదీ మౌనం ఎందుకు?: రాహుల్ ఫైర్

మరో 15 ఏళ్లపాటు అల్లు అర్జున్‌కి రాజయోగం, వేణుస్వామిని ఆడుకుంటున్న నెటిజన్లు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments