Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో పేలుతున్న 'స్కంద' మూవీ సెటైర్స్

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (16:52 IST)
బోయపాటి శీను దర్శకత్వం వహించిన స్కంద చిత్రం విడుదలై పది రోజులు దాటింది. రామ్ పొతినేని హీరో. తొలిరోజు డివైడ్ టాక్ వచ్చినా, మాస్ ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు అమితంగా ఇష్టపడ్డారు. బోయపాటి సినిమాలు అంటేనే పవర్ఫుల్ డైలాగులతో పాటు హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా ఉంటుంది. "స్కంద''లో వాటికి లోటు లేకపోవటంతో పాటు, ఎనర్జిటిక్ రామ్, శ్రీలీల కాంబో బాగుండటంతో యూత్ ఈ సినిమాను బానే చూశారు. 
 
పైగా, మార్కెట్‌లో ఏ సినిమా కూడా లేకపోవటం మరో బెనిఫిట్‌గా చెప్పుకోవచ్చు. ఇక సినిమాలో బోయపాటి ఏపీ, తెలంగాణ పొలిటికల్ అంశాలతో పాటు తాజా పాలిటిక్స్, కొందరు కీలక వ్యక్తులపై అదిరిపోయే సెటైర్లు పేల్చారు. ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ సీఎం, తెలంగాణ సీఎం.. వారి మ‌ధ్య లోగుట్టుగా ఉన్న రిలేషషన్సే కీలక అంశాలుగా ఉన్నాయి. 
 
బోయపాటి 'స్కంద' సినిమాను కంప్లీట్ పొలిటికల్ యాక్ష‌న్‌ డ్రామాగా తెరకెక్కించటంతో పాటు, సత్యం రామలింగరాజు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని చేసిన సన్నివేశాలు చాలామందికి కనెక్ట్ అయ్యాయి. అలాగే సినిమాలో గత ఎన్నికలలో వైసీపీకి రాజకీయ వ్యూహ‌క‌ర్త‌గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్‌పై రచ్చరవితో వెయించిన సెటైరికల్ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.‌ కరెంట్ పొలిటికల్ సినారియోకు దగ్గరగా రాసిన ఈ మాటలు ప్రేక్షకులను నెటిజెన్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.‌ ఇప్పటివరకు బాక్సాపీసు వద్ద 'స్కంద' ₹ 60 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments