Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రెమో' చిత్ర స‌క్సెస్‌ తెలుగులో నాకు మంచి వేదిక‌నిచ్చింది : హీరో శివ‌కార్తీకేయ‌న్‌

శివ‌ కార్తీకేయ‌న్ వేసిన లేడీ గెట‌ప్ చాలా బావుంద‌ని అంద‌రూ అంటున్నారు. నేను సినిమా త‌ప్ప‌కుండా తెలుగులో పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని తొలిరోజు ప్రెస్‌మీట్‌లోనే నేను చెప్పాను... అదీ రోజు నిజ‌మంద‌ని అన్నారు

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (18:36 IST)
శివ‌ కార్తీకేయ‌న్ వేసిన లేడీ గెట‌ప్ చాలా బావుంద‌ని అంద‌రూ అంటున్నారు. నేను సినిమా త‌ప్ప‌కుండా తెలుగులో పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని తొలిరోజు ప్రెస్‌మీట్‌లోనే నేను చెప్పాను... అదీ రోజు నిజ‌మంద‌ని అన్నారు నిర్మాత దిల్‌రాజు. 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు తెలుగులో విడుద‌ల చేసిన చిత్రం `రెమో`. శివ‌కార్తీకేయ‌న్‌, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా న‌టించిన త‌మిళ చిత్రం `రెమో`ను తెలుగులో న‌వంబ‌ర్ 24న విడుద‌ల చేశారు. భాగ్యరాజ్ క‌న్న‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. సినిమా హిట్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్స్ సాధిస్తున్న సంద‌ర్భంగా ఈ సినిమా స‌క్సెస్‌మీట్‌ను నిర్వ‌హించారు. ఈ కార్యక్ర‌మంలో దిల్ రాజు, శివ‌కార్తీకేయ‌న్‌, కీర్తి సురేష్‌, పి.సి.శ్రీరాం, అనిరుధ్‌, డైలాగ్ రైట‌ర్ రాజేష్‌, శ్రీమ‌ణి, స‌తీష్ త‌దిత‌రులు పాల్గొని సినిమా స‌క్సెస్‌పై త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.
 
ఇంత‌కుముందు నేను త‌మిళంలో వ‌చ్చిన వైశాలి సినిమాను తెలుగులో రిలీజ్ చేశాను. వైశాలి మంచి స‌క్సెస్ సాధించింది. అలాగే మ‌ణిర‌త్నంగారి ఓకే బంగారం సినిమాను కూడా తెలుగులో విడుద‌ల చేస్తే అది కూడా పెద్ద హిట్ సాధించింది. ఇప్పుడు అలాగే త‌మిళంలో పెద్ద హిట్ అయిన రెమో సినిమా తెలుగులో విడుద‌ల చేశాను. తెలుగు ప్రేక్ష‌కులు నా న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ సినిమాను స‌క్సెస్ చేశారు.
 
శివ‌కార్తీకేయ‌న్ న‌ట‌న‌కు త‌మిళంలో ఈ సినిమాకు ఎంత మంచి రెస్పాన్స్ వ‌చ్చిందో తెలుగులో కూడా అంతే మంచి రెస్పాన్స్ రావ‌డం ఆనందంగా ఉంది. రాజేష్ సినిమాకు మంచి సంభాష‌ణ‌లు రాస్తే, శ్రీమ‌ణి అద్భుత‌మైన సాహిత్యాన్ని అందించారు. ఈ సినిమా నిర్మా ఆర్‌. రాజా సినిమాను తెలుగులోకి విడుద‌ల చేయ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఈ సినిమా స‌క్సెస్ అయిన సందర్భంగా రాజాగారికి కూడా కంగ్రాట్స్ అని దిల్ రాజు అన్నారు. 
 
మెగాస్టార్ చిరంజీవి సినిమా టీజ‌ర్‌, సాంగ్స్ బావున్నాయని అభినందించారు. సినిమా కూడా చూస్తాన‌ని అన్నారు. ఆయ‌న‌కు థాంక్స్‌. నిన్న ఓ థియేట‌ర్‌లో వెళ్లి ఆడియెన్స్ మ‌ధ్య రెమో సినిమా చూశాను. సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగులో అనువాద‌మై, పెద్ద రేంజ్‌లో విడుద‌లైన సినిమా రెమో నాకు మంచి డెబ్యూ మూవీ అయ్యింది. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. దిల్‌రాజు ఈ చిత్రంతో తెలుగులో నాకు మంచి ప్లాట్‌ఫాం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా దిల్‌రాజుగారికి, నిర్మాత రాజాకు ధన్యవాదాల అని హీరో శివకార్తికేయన్ అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Birthday: బర్త్ డే జరుపుకుందామనుకుంటే.. కేకు పేలింది.. (video)

అధ్యక్షా... ఈ పోల్ ఇపుడు అవసరమా? పరువు పోగొట్టుకున్న టి.కాంగ్రెస్, రేవంత్ ఫైర్

Hall Tickets: హాల్ టిక్కెట్లు లేకపోయినా పరీక్షలు రాయడానికి అనుమతి.. ఎక్కడంటే?

అది మా పనోళ్ల కోసం నిర్మించిన సెక్యూర్డ్ భవనం : మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Video)

ప్రయాగ్ రాజ్ మోనాలిసా ఇంటికి దర్శకుడు సనోజ్ మిశ్రా, సినీ ఆఫర్ కన్ఫర్మ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments