Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను నిద్రపోకుండా కథ విన్న సినిమా ఇదే.. ఒళ్లు గగుర్పొడిచింది అంటున్న శివగామి

ఆమె డైలాగ్ చెబుతుంటే తోటి నటీనటులు మూగపోయారు. మైగాడ్ మైగాడ్ అంటూ వణికిపోయారు. ఆ శక్తివంతమైన నటనలో, డైలాగ్ డెలివరీలో పది శాతం మేం చూపించగలమా అంటూ భయపడిపోయారు. ఇక హీోయిన్ అయితే నా వల్ల కాదనేసింది. ఆమెను

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (08:05 IST)
ఆమె డైలాగ్ చెబుతుంటే తోటి నటీనటులు మూగపోయారు. మైగాడ్ మైగాడ్ అంటూ వణికిపోయారు. ఆ శక్తివంతమైన నటనలో, డైలాగ్ డెలివరీలో పది శాతం మేం చూపించగలమా అంటూ భయపడిపోయారు. ఇక హీోయిన్ అయితే నా వల్ల కాదనేసింది. ఆమెను చూసిన కళ్లతో మాకేసి ఎవరైనా చూస్తారా.. ఆమెను చూస్తూ డైలాగ్ పలకగలమా అంటూ నేరుగా దర్శకుడి వద్దకే వెళ్లి మొరపెట్టుకుంది. ఇక హీరో అయితే ఆమె ముందు మేమెవరం మిగలం. ఏం చేయాలి డార్లింగ్ అంటూ దర్శకమిత్రుడినే అడిగేశాడు. ఇదీ ఆమె స్టేచర్, మమతను, ఆగ్రహాన్ని, నిష్పక్షపాతాన్ని కంటిచూపుతో ప్రదర్శించిన రాజమాత శివగామి.. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇంతవరకు వచ్చిన మహిళా పాత్రల్లో ఇంత శక్తివంతమైన పాత్ర లేదని ప్రేక్షకులు, విమర్శకులు తేల్చి పడేసిన నట వీరాణ్మూర్తి ఆమె.
 
రమ్యకృష్ణ. కాదు శివగామి.. ఒక్క సినిమా ఆమెను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఆమె హీరోయిన్ కాదు. కానీ హీరోను, విలన్‌ని, కథానాయికలను కూడా మాటతో శాసించిన రాజమాత. నీలాంబరి నుంచి శివగామి వరకు ఆమె నటనలో చూపించిన వైదుష్యం మరే మహిళకూ దక్కలేదంటే కాదనేవారే ఉండరు. దాదాపు మూడు దశాబ్దాలుగా విజయవంతంగా కెరీర్‌ను కొనసాగిస్తున్న రమ్యకృష్ణను మరో ఎత్తుకు తీసుకెళ్లింది ‘బాహుబలి’లోని శివగామి పాత్ర. రాజమౌళి తనపై పెట్టుకున్న నమ్మకానికి వంద శాతం న్యాయం చేసింది రమ్యకృష్ణ. 
 
అయితే ఈ సినిమాలో ఓ సీన్‌ చేసేటపుడు చాలా భయమేసిందట. దాని గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘శివగామి పాత్రకు నేను ఎలాంటి హోమ్‌వర్కూ చేయలేదు. రాజమౌళి చెప్పింది చెప్పినట్టు చేశానంతే. సాధారణంగా ఎవరైనా డైరెక్టర్‌ నాకు కథ చెబుతంటే నిద్ర వచ్చేస్తుంటుంది. కానీ, రెండు గంటలపాటు రాజమౌళి నాకు కథ చెబుతుంటే ఒళ్లు గగుర్పొడిచింది. నేను నిద్రపోకుండా కథ విన్న సినిమా ఇదేనేమో. శివగామి పాత్రలో నేను నన్ను తప్ప మరొకరిని ఊహించుకోలేదు. అయితే ఈ సినిమాలో ఓ సీన్‌ చేసేటపుడు మాత్రం చాలా భయం వేసింది. 
 
నీటిలో మునిగి బిడ్డను పట్టుకునే సీన్‌ చాలా సవాలుతో కూడుకున్నది. ఆ సీన్‌ను కేరళలో నీటి ప్రవాహం అధికంగా ఉండే చల్లకుడి జలపాతం వద్ద షూట్‌ చేశారు. అతివేగంగా సుడులు తిరిగే ఆ జలపాతంలోకి దిగి నేను మునిగిపోయి చేతులు బయటకి పెట్టాలి. నీటి వేగం వల్ల నేను అటూ, ఇటూ వెళ్లిపోయేదాన్ని. పక్కనుంచి రాజమౌళి ‘శివగామి మొహంలో నేను భయం చూడకూడదు’ అని చెప్పేవారు. దీంతో భయపడుతూనే ఆ సీన్‌ను కంప్లీట్‌ చేశా. నీటిలో మునిగినపుడు భయానికి గురైనా పైకి వచ్చినపుడు ధైర్యంగా ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చేదాన్నన’ని చెప్పింది రమ్యకృష్ణ.
 
రమ్యకృష్ణ కష్టం వృధా పోలేదు. దివిసీమ తుపాను సమయంలో నలభై ఏళ్ల క్రితం ఒక మహిళ తుపానులో చిక్కుకుని తన బడ్డను చేతులమీద పైకి లేపి నీటికి ఎదురీదివచ్చి కాపాడుకున్న వైనాన్ని రాజమౌళి తన తండ్రి విజయేంద్రప్రసాద్ నుంచి విని పదేళ్ల తర్వాత దాన్ని బాహుబలిలో వాడుకున్న వైనం చలనచిత్ర చరిత్రలో ఒక మహా ఉద్విగ్న దృశ్యానికి తెరతీసింది. శివుడి పాదాలను కట్టప్ప తన నెత్తిమీద పెట్టుకున్న దృశ్యంకంటే తన దృష్టిలో శివగామి నదిలో బిడ్డను ఎత్తుకున్న దృశ్యమే గొప్పదని రాజమౌళి స్వయంగా ప్రశంసించాడంటే శివగామికి దక్కిన గౌరవమది.
 
బాహుబలిలో హీరో, హీరోయిన్లను కూడా అధిగమించి శివగామి పాత్రపై పుస్తకం ది రైజింగ్ ఆఫ్ శివగామి పేరుతో ఇంగ్లీషులోను, శివగామి కథ పేరుతో తెలుగులోనూ ఇప్పటికే వచ్చేసింది. ఇంకా 12 భాషల్లో ఈ పుస్తకాన్ని ముద్రించనున్నారంటే భారతీయ ప్రేక్షకులలో ఒక శక్తిస్వరూపిణిగా శివగామి ప్రదర్శించిన శిఖరస్థాయి నటన ఏ రేంజిలో ఉందో అర్థమవుతుంది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గడ్డం, మీసంతో కనిపించిన అఘోరీ.. చేతిలో నిమ్మకాయలు.. ఏం చేస్తోంది..? (video)

ఆర్టీసీ బస్సు.. చివరి సీటులో యువకుడు ఆత్మహత్య.. కారణం ఏంటి?

గర్భిణులకు ఓవర్ డోస్ యాంటీబయోటిక్స్.. నకిలీ డాక్టర్ అరెస్ట్

అదానీతో జగన్ మెడకు ఉచ్చు.. విచారణ ఖాయమేనా..?

పవన్ ప్రచారం ఫలించింది.. రేవంతన్న క్యాంపెయిన్ తప్పిపోయింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments