Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైమా అవార్డ్ ప్రతి కామన్ మ్యాన్ కు అంకితం - నవీన్ పోలిశెట్టి

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (16:56 IST)
Naveen Polishetty, Allu Arjun, Ranveer Singh
సహజమైన నటనతో ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఆయన నటించిన జాతిరత్నాలు సినిమా కోవిడ్ టైమ్ లోనూ ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 70  కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ఆ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమా నవీన్ కు  సైమా బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) అవార్డునూ సంపాదించి పెట్టింది. తాజాగా జరిగిన సైమా అవార్డ్స్ లో జాతి రత్నాలు చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా పురస్కారం గెల్చుకున్నారు నవీన్ పోలిశెట్టి 
 
ఈ సందర్భంగా నవీన్ పోలిశెట్టి స్పందిస్తూ...నేను సినిమా హీరో అవుతానని చెబితే..అలాంటి కలలు కనకు అని అనేవారు. ఇవాళ నా కల నిజమైంది. సైమాలో బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) అవార్డ్ అందుకోవడం మర్చిపోలేని అనుభూతిని ఇస్తోంది. నేను అభిమానించే హీరోలు అల్లు అర్జున్, రన్వీర్ సింగ్ సమక్షంలో అవార్డ్ అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ పురస్కారం ఇచ్చిన స్ఫూర్తితో మరింత కష్టపడి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తాను. ప్రతి సాధారణ యువకుడికి ఈ అవార్డ్ ను అంకితం ఇస్తున్నా. మీరూ కష్టపడి, ప్రయత్నిస్తే నాలాగే అనుకున్నది సాధించగలరు అని అన్నారు.
 
ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అనుష్క శెట్టి నాయికగా నటిస్తున్నది. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. వచ్చే ఏడాది విడుదల కానున్న నవీన్ అనుష్క సినిమాపై మంచి అంచనాలున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments