Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sidhu : తెలుసు కదా చిత్రం నుంచి సిద్ధు జొన్నలగడ్డ హోలీ పోస్టర్

దేవీ
శుక్రవారం, 14 మార్చి 2025 (19:10 IST)
Telusu kadaa Holi poster
సిద్దు జొన్నలగడ్డ అప్ కమింగ్ రొమాంటిక్ డ్రామా తెలుసు కదా. ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఎమోషన్స్, కలర్స్, లైఫ్ సెలబ్రేషన్ గా ఉంటుందని హామీ ఇస్తోంది. ప్రస్తుతం 'తెలుసు కదా' షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. సిద్దు, రాశి, శ్రీనిధి లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
 
హోలీ సందర్భంగా, పండుగ సారాంశాన్ని పర్ఫెక్ట్ గా చూపించే స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో సిద్దు, రాశి, శ్రీనిధి అందరూ కలిసి పండుగను ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూ కలర్ ఫుల్ గా కనిపించారు. సిద్దూ సాంప్రదాయ కుర్తా ధరించి కనిపించగా, రాశి, శ్రీనిధి చీరలలో చక్కదనం జోడించారు. వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. తెలుసు కదా కూడా పండుగలాగే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందని ఈ విజువల్ ప్రామిస్ చేస్తోంది. 
 
ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా పని చేస్తున్నారు. శీతల్ శర్మ కాస్ట్యూమ్ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

3D map: నక్షత్ర నిర్మాణానికి కీలకం.. పాలపుంతలోని తొలి త్రీడీ మ్యాప్ విడుదల

ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తి: ఢిల్లీ హోటల్ గదిలో బ్రిటన్ యువతిపై అత్యాచారం

జనసంద్రంగా మారిన పిఠాపురం... జయకేతనం సభ ప్రారంభం!!

ఫ్లైట్ ల్యాండ్ కాగానే చెలరేగిన మంటలు.. విమానం రెక్కలపై ప్రయాణికుల ఆర్తనాదాలు..

ఏప్రిల్ 15 - 20 మధ్య ప్రధాని నరేంద్ర మోడీ రాక!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments