Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔను.... ఆమె ఎస్ చెప్పింది.. ఎంగేజ్డ్: హీరో సిద్ధార్థ్

వరుణ్
గురువారం, 28 మార్చి 2024 (17:18 IST)
ఔను మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అని హీరో సిద్ధార్థ్ ప్రకటించారు. ఈ మేరకు తమ పెళ్లి ఫోటోను ఆయన షేర్ చేశారు. హీరోయిన్ అదితి రావు హైదరీని హీరో సిద్ధార్థ్ రహస్యంగా వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరి వివాహం తెలంగాణా రాష్ట్రంలోని వనపర్తి జిల్లా శ్రీరంగపురం, శ్రీరంగనాయకస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో గురువారం సిద్ధార్థ్ తన భార్య అదితితో ఉన్న ఫోటోను షేర్ చేశారు. "ఆమె ఎస్ చెప్పింది.. ఎంగేజ్డ్" అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ జోడించారు. అలాగే, అదితిరావు కూడా అదే ఫొటోని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ, 'అతడు ఎస్ చెప్పాడు' అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పలువురు సినీ తారలు, నెటిజన్లు స్పందించారు. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
 
కాగా, అజయ్‌ భూపతి తెరకెక్కించిన ‘మహా సముద్రం’ కోసం సిద్ధార్థ్‌, అదితి తొలిసారి కలిసి వర్క్‌ చేశారు. ఆ సినిమా షూట్‌లోనే స్నేహం కుదిరింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం సాగింది. ఆ కథనాల్లో ఎలాంటి నిజం లేదని.. తాము స్నేహితులం మాత్రమేనని పలు సందర్భాల్లో ఈ జంట క్లారిటీ ఇచ్చింది. ఇదిలావుంటే, వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో బుధవారం ఉదయం వీరి పెళ్లి జరిగిందని కథనాలు చక్కర్లు కొట్టాయి. పెళ్లి కారణంగానే అదితి తన తదుపరి చిత్రం 'హీరామండీ: ది డైమండ్‌ బజార్‌' ఈవెంట్‌కూ హాజరు కాలేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments