Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య.. రియల్ సింహం విత్ గోల్డెన్ హార్ట్ : శృతిహాసన్

Webdunia
శనివారం, 7 జనవరి 2023 (15:00 IST)
హీరో బాలయ్య రియల్ సింహం విత్ గోల్డెన్ హార్ట్ అని హీరోయిన్ శృతిహాసన్ అన్నారు. బాలయ్యతో కలిసి ఆమె నటించిన వీరసింహారెడ్డి చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఒంగోలు వేదికగా జరిగింది. ఇందులో ఆమె పాల్గొని మాట్లాడుతూ, మైత్రీ మూవీ మేకర్స్ కి బిగ్ థాంక్స్. వారితో ఇది నాకు మూడో సినిమా. వీరసింహారెడ్డి కి పని చేసినం నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. దర్శకుడు గోపీచంద్ గారితో ఇది నా మూడో సినిమా. పరిశ్రమలో నాకు అన్నయ లాంటి వ్యక్తితను. తనతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని వుంది. బాలకృష్ణ గారితో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.  బాలయ్య గారు రియల్ సింహం విత్ గోల్డెన్ హార్ట్. జై బాలయ్య’’ అన్నారు.
 
నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. ఇలాంటి అద్భుతమైన సినిమా చేసుకునే అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు. శ్రుతిహాసన్ గారు ఇందులో ఇరగదీశారు. అలాగే హానీ రోజ్, దునియా రవి, చంద్రక రవి అద్భుతంగా పెర్ ఫార్మ్ చేశారు. మా దర్శకుడు గోపీచంద్ మలినేని గారు సినిమాని ఇరగదీశారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్ చింపి ఆరేశారు. ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ గారు, ఎడిటర్ నవీన్ నూలి అద్భుతమైన వర్క్ ఇచ్చారు. తమన్ మ్యూజిక్ ఇరగగొట్టాడు. రీరికార్డింగ్ వేరే లెవల్ లో వుంది. నందమూరి అభిమానుల అంచనాలు మించేలా వీరసింహారెడ్డి వుంటుంది. రెండు సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు
 
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. బాలకృష్ణ గారితో సినిమా చేయడం మా కల. వీరసింహారెడ్డి తో ఆ కల తీరినట్లయింది. ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి మా కృతజ్ఞతలు. మాకు ఇంత గొప్ప సినిమా తీసి పెట్టిన గోపిచంద్ మలినేని గారికి థాంక్స్. ఈ సినిమాలో పని చేసిన అందరినీ కృతజ్ఞతలు. ఈ ఈవెంట్‌కి విచ్చేసిన బి గోపాల్, అంబికా కృష్ణ గారికి కృతజ్ఞతలు. జనవరి 12న వీరసింహ రెడ్డి పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments