Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా అందాలు చూసేందుకే ప్రేక్షకుడు థియేటర్‌కు వస్తాడు.. చూపిస్తే తప్పేంటి : శృతిహాసన్

అందంలో ఆకాశంతో పోటీపడే శ్రుతిహాసన్‌ సినిమాల ఎంపిక, సక్సెస్‌ విషయాల్లో రేసుగుర్రంలా దూసుకుపోతోంది. ఇటు ప్రేమ కథా చిత్రాలతోనూ, అటు కమర్షియల్‌ సినిమాలతోనూ సక్సెస్‌లు అందుకుంటూ తనకు తనే సాటి అని నిరూపించు

Webdunia
ఆదివారం, 5 మార్చి 2017 (11:51 IST)
అందంలో ఆకాశంతో పోటీపడే శ్రుతిహాసన్‌ సినిమాల ఎంపిక, సక్సెస్‌ విషయాల్లో రేసుగుర్రంలా దూసుకుపోతోంది. ఇటు ప్రేమ కథా చిత్రాలతోనూ, అటు కమర్షియల్‌ సినిమాలతోనూ సక్సెస్‌లు అందుకుంటూ తనకు తనే సాటి అని నిరూపించుకుంటోంది. ఇప్పటివరకూ లవ్‌ స్టోరీలే ఎక్కువ చేసిన శ్రుతి తాజాగా చారిత్రక నేపథ్యంతో సాగే ఓ భారీ సినిమాకీ ఓకే చెప్పింది. ఏ విషయాన్ని అయినా మొహమాటం లేకుండా సూటిగా స్పష్టంగా చెప్పే శ్రుతి ఇటీవలి కాలంలో తనలో చాలా మార్పు వచ్చింది అంటోంది. అదేమిటో ఆమె మాటల్లోనే....
 
గతంలో మొహమాటాలకు పోయి కథలు నచ్చకపోయినా కొన్ని సినిమాలు చేశాను. దాని వలన చాలా నష్టపోయాను. ఇప్పుడు అలాంటివి ఏవీ పెట్టు కోవడంలేదు. నచ్చితేనే చేస్తున్నాను. లేకపోతే నో అని చెప్పేస్తున్నాను. హోదా గురించి ఆలోచించినా, దాన్ని ఆశించినా ఒత్తిడి తప్పదు. ఈ హోదాను నేనేమీ కోరుకోలేదు. వస్తుందని కూడా ఊహించ లేదు. ప్రారంభంలో నన్ను ఐరన్‌లెగ్‌ అన్నారు. ఇప్పుడు గోల్డెన్‌లెగ్‌ అంటున్నారు. మరో నాలుగైదు సంవత్సరాల తరువాత ఈ హోదా, పేరు ఉండకపోవచ్చు. అయినా ఎప్పటి శ్రుతిలాగే ఉంటాను. మంచి సినిమాలు చేయడానికే ప్రయత్నిస్తాను.
 
కమర్షియల్‌ సినిమాల్లో హీరోయిన్‌ అందాలే మెయిన్‌ అట్రాక్షన్‌. అలాంటి సినిమాల్లో నటించే టప్పుడు అందాల ఆరబోత ఎలా తప్పు అవుతుంది. సీన్‌ డిమాండ్‌ లాంటి మాటలు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ప్రేక్షకులు హీరోయిన్ల అందాలను తెరమీద చూడడానికే సినిమాకు వస్తారు. అలాంటి వారిని కూడా మెప్పించాల్సిన బాధ్యత హీరోయిన్ల మీద ఉంది. అలాంటప్పుడు అందాల ప్రదర్శన తప్పుకాదు. దానికి నేనేమీ మినహాయింపూ కాదు. ఈ కాలానికి ఇది అవసరం కూడా.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments