Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి చేసుకున్నా... పెళ్లిపై శృతిహాసన్ వ్యంగ్యాస్త్రాలు

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (11:26 IST)
తన పెళ్లిపై వస్తున్న వార్తలపై హీరోయిన్ శృతిహాసన్ వ్యంగ్యంగా స్పందించారు. క్రిస్మస్‌తో పాటు కొత్త సంవత్సర వేడుకలను తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి జరుపుకున్నట్టు చెప్పారు. ఆ వేడుకల్లో స్నేహితులు, బాయ్‌ఫ్రెండ్ మైఖేల్‌తో కలిసి తీసుకున్న ఫోటోలనే తాను షేర్ చేసినట్టు వెల్లడించింది. 
 
కాగా, లోకనాయకుడు కమల్ హాసన్‌ గారాలపట్టి శృతిహాసన్ ఆ మ‌ధ్య యూర‌ప్‌కి చెందిన మైఖేల్ కోర్సెల్‌తో చెట్టాప‌ట్టాలేసింది. ఆ తర్వాత తన తల్లి, సినీ నటి సారికకు పరిచయం చేసింది. అనంతరం బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఓ పెళ్ళిలో మెరిసింది. 
 
వారితో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఉండటంతో శృతి పెళ్లికి సంబంధించి పుకార్లు గుప్పుమన్నాయి. త్వ‌ర‌లోనే శృతి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి అని బాలీవుడ్ మీడియా జోస్యాలు చెప్పింది. అయితే వీరిద్ద‌రికి సంబంధించి కొన్నాళ్ళుగా ఎలాంటి వార్త‌లు రాక‌పోవ‌డం విశేషం.
 
ఈ నేపథ్యంలో శృతి లండ‌న్‌కి వెళ్లి త‌న బాయ్ ఫ్రెండ్‌తో క‌లిసి క్రిస్మ‌స్‌, నూత‌న సంవ‌త్స‌ర వేడుకలు జ‌రుపుకున్నారు. స్నేహితులు, మైఖేల్‌తో క‌లిసి కొన్ని ఫోటోలు దిగ‌గా వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో మ‌ళ్లీ శృతి పెళ్ళిపై ప్ర‌చారం మొద‌లైంది. 
 
ఓ పత్రిక 2019లో శృతి త‌న బాయ్ ఫ్రెండ్‌ని చేసుకోబోతున్నార‌ని క‌థ‌నం రాసింది. దీనిని రీ ట్వీట్ చేస్తూ .. 'నిజంగా ?.. ఇది నాకు వార్తే' అంటూ కాస్త వ్యంగ్యంగా స్పందించారు. హిందీలో 'బెహెన్‌ హోగీ తెరి' త‌ర్వాత శృతి మ‌ళ్ళీ వెండితెర‌పై క‌నిపించ‌లేదు. ప్ర‌స్తుతం 'శ‌భాష్ నాయుడు' అనే చిత్రంలో తన తండ్రి కమల్ హాసన్‌తో కలిసి నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments