Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఖైదీ నెంబర్ 150''లో శ్రియ.. ఠాగూర్ జంట తెరపై రిపీట్.. మెగా ఫ్యాన్స్ హ్యాపీ..

నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణిలో శ్రియ శాతకర్ణి భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా నటిస్తోంది. దర్శకుడు క్రిష్‌ శాతకర్ణి భార్య వశిష్టా దేవి పాత్

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (20:11 IST)
నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణిలో శ్రియ శాతకర్ణి భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా నటిస్తోంది. దర్శకుడు క్రిష్‌ శాతకర్ణి భార్య వశిష్టా దేవి పాత్రను అద్భుతంగా, శ్రియ కెరీర్‌లో గుర్తుండిపోయేలా మలిచాడు. ప్రస్తుతం చిరంజీవి 150వ చిత్రంగా ‘ఖైదీ నెంబర్ 150’ తెరకెక్కుతోంది. ప్రధాన పాత్రలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
 
వినాయక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో శ్రియ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.  గతంలో వినాయక్ – చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన ‘ఠాగూర్’ చిత్రంలో శ్రియ నటించింది. ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంలోనూ శ్రియను ఓ కీలక పాత్రలో కన్పించాలని సంప్రదించగా.. అందుకు ఆమె ఓకే చెప్పేసిందని తెలిసింది. దీంతో ఒకేసారి టాప్ అండ్ సీనియర్ హీరోలైన బాలయ్య, చిరంజీవిల సినిమాల్లో కనిపించడం పట్ల శ్రియ ఉబ్బితబ్బివవుతోంది. 
 
ఖైదీ నెం 150లో చిరంజీవికి సంబంధించి ఓ యంగ్ పాత్ర ఉండగా ఆ పాత్రకు జోడిగా ఈ అమ్మడిని సెలక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ పాత్ర చిన్నదే అయినప్పటికి మంచి గుర్తింపు తెచ్చే పాత్ర కావడంతో శ్రేయ ఆ రోల్‌లో నటించేందుకు రెడీ అయిందట..
అన్నీ చూడండి

తాజా వార్తలు

Rains: తెలంగాణలో మరో నాలుగు రోజులు మోస్తరు వర్షాలు

బంగారు నగల్లో వాటా ఇవ్వాల్సిందే లేదా చితిపై తల్లి శవంతో పాటు నన్నూ కాల్చేయండి (Video)

వల్లభనేని వంశీకి తీరని కష్టాలు.. బెయిల్ వచ్చినా మరో కేసులో రిమాండ్

Rashtriya Parivarik Labh Yojana: నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్-రూ.30వేలు ఈజీగా పొందవచ్చు

ప్రేమ పేరుతో మైనర్ బాలికలపై వేధింపులు.. అక్కాచెల్లెళ్లను అలా వాడుకోవాలనుకున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments