Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో పడిన శ్రియ.. పోలీసులకు సారీ చెప్పడంతో వదిలేశారు.. (video)

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (10:09 IST)
అందాల నటి శ్రియ. ఆమె హవా ఇపుడు బాగా తగ్గిపోయింది. సినీ అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఆమెకు వచ్చే ఒక్కో ఛాన్స్‌ను మిస్ చేసుకోకుండా నటిస్తోంది. ఈ క్రమంలో ఆమె లండన్‌లో చిక్కుల్లో పడింది. అత్యంత గట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోకి ప్రవేశించడంతో ఆమెను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులకు క్షమాపణలు చెప్పి, వారి నుంచి బయటపడ్డారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రియ తాజాగా ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం పేరు సుందకారి. ఈ చిత్రం షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. స్థానిక స్టాన్‌స్టెడ్‌ విమానాశ్రయంలో కొన్ని ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా.. శ్రియ పొరపాటున అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోకి ఆమెకు తెలియకుండానే ప్రవేశించారు.
 
దీన్ని గమనించిన సాయుధ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాల్లేకుండా ఎందుకు వచ్చారంటూ ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు.

సమీపంలోనే ఉన్న నటుడు విమల్‌ వెంటనే అక్కడకు చేరుకొని పరిస్థితిని వివరించారు. సినిమా షూటింగ్‌ చేస్తున్నామని పోలీసులకు చెప్పి, అవసరమైన పత్రాలన్నీ చూపించారు. శ్రియ పోలీసులకు క్షమాపణ చెప్పడంతో వదిలిపెట్టారు. అనంతరం షూటింగ్‌ జరుపుకొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments