Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మపై పిచ్చి... ఆ చిత్రాన్ని 267 సార్లు చూసిన హీరోయిన్!

Shreya Dhanwanthary
Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (11:16 IST)
సాధారణ ప్రేక్షకుడు ఒక సినిమాను ఒకసారి లేదా రెండు సార్లు చూస్తారు. అదే వీరాభిమానులు అయితే, మహా అయితే  పదిసార్లు చూస్తారు. కానీ, ఈ హీరోయిన్ మాత్రం ఒక చిత్రాన్ని ఏకంగా 267 సార్లు చూసింది. ఆమె ఎవరో కాదు.. తెలుగు హీరోయిన్ శ్రేయా ధన్వంతరి. జోష్ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ... ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992 వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఆమెకు తెలుగు సినిమాలంటే మక్కువ ఎక్కువ.
 
అందుకే, సెన్సేషెనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించినన 'క్షణ క్షణం' చిత్రాన్ని ఆమె ఏకంగా 267 సార్లు చూసిందట. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో రాసుకొచ్చింది. తెలుగులో నా ఫేవరెట్‌ సినిమాను 267వ సారి చూశాను. ఇందులో హీరో దగ్గుబాటి వెంకటేష్‌, పరేశ్‌ రావల్‌, శ్రీదేవి అద్భుతంగా నటించారు అని చెప్పుకొచ్చింది. 
 
ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఎమ్‌ఎమ్‌ కీరవాణి బీజీఎమ్‌ కూడా సూపర్‌గా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఇలాంటి సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్‌ కొట్టవని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments