Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరామ్, ఖుషీ రవి నటించిన పిండం సెన్సార్ ను భయపెట్టిందా!

Webdunia
సోమవారం, 20 నవంబరు 2023 (17:16 IST)
Shreeram, Khushi Ravi
హారర్ జానర్ చిత్రాల పట్ల ప్రేక్షకుల్లో ఎప్పుడూ మంచి ఆసక్తి ఉంటుంది. అయితే మన దగ్గర పూర్తిస్థాయి హారర్ చిత్రాలు రావడం చాలా అరుదు. కొన్ని చిత్రాలలో రొమాంటిక్ లేదా కామెడీ ట్రాక్ ల వల్ల హారర్ మోతాదు తగ్గిపోతుంది. అలాంటి ట్రాక్ ల జోలికి పోకుండా, కేవలం ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా తెలుగులో అసలుసిసలైన హారర్ చిత్రం రాబోతోంది.
 
ప్రముఖ హీరో  శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం 'పిండం'. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు అసలైన హారర్ అనుభూతిని అందించడానికి రాబోతుంది.
 
తాజాగా 'పిండం' సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ మూవీని చూసి థ్రిల్ అయ్యారు. ఈ మధ్య కాలంలో ఈస్థాయిలో భయపెట్టిన హారర్ చిత్రాన్ని చూడలేదని అభిప్రాయపడ్డారు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు, తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠను రేకెత్తిస్తూ అద్భుతంగా రూపొందించారని చిత్ర బృందాన్ని ప్రశంసించారు.
 
హైదరాబాద్ లో డిసెంబర్ 7వ తేదీన సాయంత్రం 'పిండం' ప్రీ రిలీజ్ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఈ వేడుకను ఆద్యంతం ఆసక్తికరంగా, విభిన్న రీతిలో, సినిమా కు తగినట్లుగా సరికొత్త అనుభూతిని కలిగించేలా ప్లానింగ్ చేస్తున్నారు చిత్ర బృందం.
 
హారర్ జానర్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'పిండం' చిత్ర విడుదల తేదీని తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాని డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments