Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shraddha: శ్రద్ధా శ్రీనాథ్ ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్ వెబ్ సిరీస్ సిద్ధమైంది

దేవీ
గురువారం, 4 సెప్టెంబరు 2025 (16:58 IST)
Shraddha Srinath
థ్రిల్లర్ సస్పెన్స్‌తో పాటు, ఫ్యామిలీ కాంఫ్లిక్ట్ కి సంబంధించిన ఎమోషన్స్‌ని కూడా కలిపి చూపించే విధంగా ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్ వెబ్ సిరీస్ వుంటోందనీ, శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్ లో నటించిన ఈ సిరీస్ అక్టోబర్ 2న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. బ్లాక్ వారంట్ తర్వాత   నెట్‌ఫ్లిక్స్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని రాజేష్ ఎం. సెల్వా డైరెక్ట్ చేస్తున్నారు.
 
నెట్‌ఫ్లిక్స్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలసి చేస్తున్న న్యూ థ్రిల్లర్ ది గేమ్: యూ నెవర్ ప్లే అలోన్ లో సంతోష్ ప్రతాప్, చందినీ, శ్యామ హరిని, బాల హసన్, సుబాష్ సెల్వం, వివియా సంతోష్, ధీరజ్, హెమా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. స్ట్రాంగ్ స్టోరీటెల్లింగ్‌తో పాటు టైమ్‌లి థీమ్స్‌ని మిక్స్ చేస్తూ ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.
 
నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ మాట్లాడుతూ..  ది గేమ్ మా ఈ ఏడాది ఫస్ట్ తమిళ సిరీస్. సరికొత్త స్టోరీని తీసుకొస్తున్నాం. ఒక ఫీమేల్ గేమ్ డెవలపర్‌పై జరిగే కోఆర్డినేటెడ్ అటాక్ వెనక వాళ్లను ట్రాక్ చేసే ఆమె జర్నీని ఈ థ్రిల్లర్ గా ప్రజెంట్ చేస్తునాం. అప్లాజ్ తో మా కలయికలో ఇప్పటికే బ్లాక్ వారంట్ వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్ కూడా చాలా రెలివెంట్‌గా ఉంటుంది.
 
అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎండీ సమీర్ నాయర్ మాట్లాడుతూ..  ది గేమ్ అనేది డిజిటల్ యుగం రియాలిటీలను చూపించే టైమ్‌లి స్టోరీ. రాజేష్ సెల్వా స్టైల్‌తో స్ట్రాంగ్ స్టోరీటెల్లింగ్ తో ఆడియన్స్‌కి చాలా కనెక్ట్ అవుతుంది.
 
డైరెక్టర్ రాజేష్ ఎం. సెల్వా మాట్లాడుతూ..  ది గేమ్ కేవలం థ్రిల్లర్ మాత్రమే కాదు, మనం ఉన్న రియల్ వరల్డ్‌కి అద్దం పడుతుంది. ఇది పీపుల్, వాళ్ల ఛాయిస్‌లు, బలహీనతలు, నిజం – అబద్ధం మధ్య సన్నని లైన్‌ గురించిన కథ. నెట్‌ఫ్లిక్స్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్   కలయిక వలన మాకు క్రియేటివ్‌గా కొత్త ఎక్స్‌పెరిమెంట్స్ చేసే లిబర్టీ దొరికింది
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమారుడిని చంపేసి భార్యపై భర్త హత్యాయత్నం

హైదరాబాద్‌లో కుండపోత వర్షం : నిమిషాల వ్యవధిలో రహదారులు జలమయం

నాడు యూఎస్ ఎలా స్పందించిందో అలానే స్పందించాం : నెతన్యాహు

భయానక ఘటన: జూ కీపర్‌ను చంపేసి పీక్కు తిన్న సింహాలు (video)

తితిదే పాలక మండలి సభ్యుడుగా సుదర్శన్ వేణు నియామకం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments