పెళ్లైన హీరోయిన్లు రొమాంటిక్ సీన్లకు పనికిరారా? పెళ్లయ్యాక నటించడం తప్పా?

Webdunia
శనివారం, 11 జులై 2020 (19:31 IST)
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ తొలి సినిమాలో మంచి గుర్తింపు సంపాదించింది. ఇటీవలే కృష్ణ అండ్ హిజ్ లీల అనే బోల్డ్ మూవీతో డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌లో పలకరించింది. 
 
కన్నడ నటి అయినప్పటికీ తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రద్ధా శ్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి తర్వాత హీరోయిన్లు రాణించకపోవడం.. పెళ్లికి తర్వాత నటించడంపై వున్న అభిప్రాయాలపై శ్రద్ధా శ్రీనాథ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. పెళ్లైన తర్వాత హీరోయిన్స్‌కి ఆఫర్స్ రాకపోవడంపై ఆమె మండిపడింది. 
 
ఇండస్ట్రీ కూడా పెళ్లైన హీరోయిన్లను చిన్న చూపు చూడటం వంటి విషయాలపైన శ్రద్ధా శ్రీనాథ్ ఫైర్ అయ్యింది. పెళ్లైన హీరోయిన్లు రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడానికి పనికి రారా..? అంటూ ఎదురుప్రశ్న వేసింది. 
 
పెళ్లైన నటీమణులు మీద చిన్నచూపు ఎందుకు? అంటూ ప్రశ్నించింది. పెళ్లికి తర్వాత నటించడడం తప్పా అంటూ.. ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ విషయంలో కన్నడ సినిమా పరిశ్రమలోని నటీమణుల నుంచి శ్రద్ధా శ్రీనాథ్‌కు పెద్ద ఎత్తున మద్దుతు లభిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag లోని G కాస్త Googleగా నిలబడింది: చంద్రబాబు

ఆయన మా డాడీయే కావొచ్చు.. కానీ ఈ యాత్రలో ఆయన ఫోటోను వాడను : కవిత

త్వరలో వందే భారత్ 4.0 : రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

తమిళనాడులోనూ ఎన్డీఏ కూటమి రాబోతోందా? సీఎం అభ్యర్థిగా టీవీకే చీఫ్ విజయ్?

కామారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments