Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు కొండారెడ్డి బురుజు సెంట‌ర్లో బాలకృష్ణ చిత్రం షూటింగ్‌

Webdunia
సోమవారం, 25 జులై 2022 (08:00 IST)
Balakrishna
నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో ఓ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్‌న రూపుదిద్దుకుటుంది. #NBK107 వర్కింగ్ టైటిల్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రేపు(సోమవారం) కర్నూలులోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
 
ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.
నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ ‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.
 
మ్యూజిక్ సెన్సేషన్  థమన్ ఎన్‌బికె107కి సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.
 
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు
సాంకేతిక విభాగం-  కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: గోపీచంద్ మలినేని,  నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, సంగీతం: థమన్, డివోపీ: రిషి పంజాబీ,ఎడిటర్: నవీన్ నూ
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, సిఈవో: చిరంజీవి (చెర్రీ),గ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి, లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవివి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments