Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళికి షాక్... మహాభారతం చిత్రాన్ని రూ.1000 కోట్లతో ప్రొడ్యూస్ చేస్తానంటూ...

మహాభారతం, రామాయణం గాథలు ఎప్పుడు విన్నా, చూసినా ఎవర్ గ్రీన్ అనే సంగతి మనకు తెలిసిందే. బాహుబలి చిత్రంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దర్శకుడిగా రాజమౌళి ఈ చిత్రాన్ని తీయాలని ఎప్పటి నుంచో అంటున్నారు. కానీ ఆయనకు షాకిచ్చే న్యూస్ ఇది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (09:48 IST)
మహాభారతం, రామాయణం గాథలు ఎప్పుడు విన్నా, చూసినా ఎవర్ గ్రీన్ అనే సంగతి మనకు తెలిసిందే. బాహుబలి చిత్రంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దర్శకుడిగా రాజమౌళి ఈ చిత్రాన్ని తీయాలని ఎప్పటి నుంచో అంటున్నారు. కానీ ఆయనకు షాకిచ్చే న్యూస్ ఇది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన బడా వ్యాపారవేత్త ఒకరు మహాభారతం చిత్రాన్ని తాను నిర్మిస్తానంటూ ముందుకు వచ్చారు. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు తాను రూ. 1000 కోట్లు వెచ్చించేందుకు సిద్ధంగా వున్నట్లు ఆయన చెప్పారు.
 
ఈ బడా వ్యాపారవేత్త పేరు బీఆర్ శెట్టి. ఇండియన్ కల్చర్ అంటే తనకు చాలా ఇష్టమని అందువల్ల మహాభారతం చిత్రాన్ని నిర్మించాలని తనకు కుతూహలంగా వున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా ఈ చిత్రాన్ని 2018లో మొదలుపెట్టి 2020 నాటికి విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని వీఎ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం చేస్తారని ఆయన ప్రకటించారు. ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తామనీ, మరిన్ని భాషల్లో డబ్ చేస్తామని ఆయన వెల్లడించారు.
 
మరి రాజమౌళి తన మహాభారతం ప్రాజెక్టును విరమించుకుంటారో లేదంటే అనుకున్నట్లే అమీర్ ఖాన్, రజినీకాంత్, మోహన్ లాల్ తదితర నటులతో చిత్రాన్ని తెరకెక్కిస్తారో వెయిట్ అండ్ సీ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments