శివరాజ్ కుమార్ పాన్ ఇండియా యాక్షన్ స్పెక్టకిల్ ఘోస్ట్ తాజా అప్డేట్

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2023 (11:21 IST)
Shivraj Kumar - Ghost
కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్యాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోన్న చిత్రం ఘోస్ట్. కన్నడ బీర్బల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
 
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఘోస్ట్ ను ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ ఆకట్టుకునే పోస్టర్ తో అనౌన్స్ చేశారు. శివరాజ్ కుమార్ గన్ తో సీరియస్ లుక్ తో ఉన్న రిలీజ్ పోస్టర్ ఘోస్ట్ ఆగమనాన్ని ప్రకటిస్తోంది. పోస్టర్ మీద ఉన్న క్యాప్షన్ "When Shadows Speak... Know The Ghost Is Arriving" అంచనాలు మరింత పెంచేలా ఉంది. ఘోస్ట్ నుండి వచ్చిన కాన్సెప్ట్ మోషన్ పోస్టర్, బిగ్ డాడీ టీజర్ ల తర్వాత అతు ట్రేడ్ లోనూ ఇటు ప్రేక్షకుల్లో చిత్రం పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
 
ఆకట్టుకునే ఘోస్ట్ ప్రచార చిత్రాల తో పాటు, ఇటీవల బ్లాక్ బస్టర్ జైలర్ లో శివన్న పాత్రకు వచ్చిన ట్రేమెండస్ రెస్పాన్స్ ఘోస్ట్ పై మరింత హైప్ ను తీసుకొచ్చింది. తమ భాషల్లో ఘోస్ట్ రైట్స్ కోసం పెద్ద పెద్ద బ్యానర్ ల నుండి ఆఫర్స్ వస్తున్నాయి. చిత్ర బృందం అక్టోబర్ రెండవ వారం నుండి దేశవ్యాప్తంగా స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ రెండవ వారంలో ట్రైలర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
 
ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. మోహన్ బి కేరే ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ లో టాప్ స్టార్స్, టెక్నీషియన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ‘ఘోస్ట్’ ని లావిష్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఘోస్ట్ అక్టోబర్ 19న దసరా కు ప్రేక్షకుల ముందుకి రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments