Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ రియాలిటీ షోను నిషేధించాలి : పోలీసులకు ఫిర్యాదు

వరుణ్
బుధవారం, 24 జులై 2024 (09:11 IST)
దేశంలో ఎంతో ప్రేక్షకాదారణ పొందిన బిగ్ బాస్ రియాలిటీ షోను నిషేధించాలని మహారాష్ట్రకు చెందిన ఓ ప్రజాప్రతినిధి డిమాండ్ చేస్తున్నారు. అంతటితో శాంతించని ఆయన ఏకంగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. హిందీలో ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్‌లో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు శివ సేన (శిందే వర్గం) అధికార ప్రతినిధి మనీషా కయాండే.. ముంబై నగర పోలీస్ కమిషనర్ని కలిసి బిగ్ బాస్ షోపై ఫిర్యాదు చేశారు.
 
జులై 18న ప్రసారమైన ఎపిసోడ్‌లో అర్మాన్ మాలిక్, కృతికా మాలిక్ జంట బెడ్రూమ్‌లో శ్రుతిమించి ప్రవర్తించిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరు అన్ని రకాల హద్దులు మీరారని మండిపడ్డారు. పిల్లలు కూడా ఈ షో చూస్తారని.. ఇలాంటి అభ్యంతరకర సీన్లు వారిపై ప్రభావం చూపిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ షోను వెంటనే నిలిపివేయాలని.. సైబర్ క్రైమ్ చట్టాల కింద కేసు నమోదు చేయాలని మనీషా డిమాండ్ చేశారు. ఇది ఏ మాత్రం ఫ్యామిలీ షో కాదని.. ఈ కార్యక్రమాన్ని నిషేధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments