శర్వానంద్ - లావణ్య త్రిపాఠిల "రాధ"కు సెన్సార్ పూర్తి.. క్లీన్ 'యు' సర్టిఫికేట్

వరుస విజయాల హీరోగా పేరు తెచ్చుకున్న శర్వానంద్, లావణ్య త్రిపాఠిలు కలిసి నటించిన చిత్రం "రాధ". ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై చంద్రమోహన్ దర

Webdunia
మంగళవారం, 9 మే 2017 (16:03 IST)
వరుస విజయాల హీరోగా పేరు తెచ్చుకున్న శర్వానంద్, లావణ్య త్రిపాఠిలు కలిసి నటించిన చిత్రం "రాధ". ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై చంద్రమోహన్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మే 12న విడుదలకానుంది. 
 
దీనిపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ... "వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్న యువ కథానాయకుడు శర్వానంద్ హీరోగా రూపొందుతోన్న అవుటండ్ అవుట్ ఎంటర్‌టైనర్ 'రాధ'. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ 'యు' సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ పూర్తి కావడంతో సినిమాను మే 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో మే 12న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. 
 
ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలు, థియేట్రికల్ ట్రైలర్స్‌కు ప్రేక్షకుల మంచి స్పందన వచ్చింది. చంద్రమోహన్‌కు 'రాధ' తొలి చిత్రమే అయినా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. రొమాన్స్, కామెడీ , ఏక్షన్ సమపాళ్ళలో ఉండే మా సినిమా అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరించే చిత్రం 'రాధ' శర్వానంద్ కెరీర్‌లో మరో హిట్ మూవీ అవుతుంది" అని చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments