Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడవాళ్లు కట్టుకునే శారీ పేరుతో రామ్‌గోపాల్‌ వర్మ చిత్రం

డీవీ
శుక్రవారం, 15 మార్చి 2024 (11:50 IST)
varam - shari
ఎప్పుడూ ఏదో చర్చల్లో వుండాలనుకునే రామ్‌గోపాల్‌ వర్మ తాజాగా మరో చర్చకు తావిచ్చారు. తను తీసిన పొలిటికల్ సినిమాలు డిజాస్టర్ కావడంతో అవేవీ పట్టించుకోకుండా మరో సినిమాను తుదిమెరుగులు దిద్దారు. ఈసారి ఆడవారి శారీపై సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు నా ఆరాధ్య దేవితో నూతన చిత్రం ‘శారీ’ అంటూ సోషల్ మీడియాలో చర్చకు తావిచ్చారు.
 
ఎవరిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయే రామ్‌గోపాల్‌ వర్మ టాలెంట్‌ని వెతికి పట్టుకోవటంలో దిట్ట అనే సంగతి అందరికి తెలిసిందే. అందుకు ఉదాహరణ ఆయన ఎంతోమంది టాలెంట్‌ ఉన్న నటీనటులను భారతదేశానికి అందించారు. స్త్రీ అంటే నాకు విపరీతమైన అభిమానం అని చెప్పే ఆర్జీవి ఆడవాళ్లు కట్టుకునే ‘శారీ’ని తన కొత్త సినిమా టైటిల్‌గా పెట్టి మరో అమ్మాయిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. 
 
‘శారీ’ సినిమా ఒక సైకలాజికల్‌ థ్రిల్లర్‌. యాధృశ్చికంగా ఒక ఇన్‌స్టా  రీల్‌లో చూసి కేరళ అమ్మాయిని  ‘శారీ’ కి సెలెక్ట్‌ చేసి సిల్వర్‌ స్క్రీన్‌కి పరిచయం చేస్తున్నారు. ఆ శారీ భామ పేరు ‘ఆరాధ్యదేవి’. ఆమె ఫస్ట్‌లుక్‌ను ఆర్జీవి డెన్‌ టాలెంటెడ్‌ ఫోటోగ్రాఫర్‌ యశ్వంత్‌ క్లిక్‌ మనిపించంగా రామ్‌గోపాల్‌ వర్మ మీడియాకి తన హీరోయిన్‌ని స్వయంగా పరిచయం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments