Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగూన్‌లో స్టంట్ క్వీన్ రోల్‌లో కంగనా రనౌత్.. ఫిబ్రవరి 24న గ్రాండ్ రిలీజ్

రంగూన్ సినిమా పనిలో కంగనా రనౌత్ బిజీ బిజీగా ఉంది. 1940 రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో జరిగిన కథ ఆధారంగా సాజిద్‌ నడియాద్‌ వాలా నిర్మిస్తున్న సినిమానే రంగూన్. ఈ సినిమాకు విశాల్‌ భరద్వాజ్‌ దర్శకుడు. ఇందులో

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (13:08 IST)
రంగూన్ సినిమా పనిలో కంగనా రనౌత్ బిజీ బిజీగా ఉంది. 1940 రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో జరిగిన కథ ఆధారంగా సాజిద్‌ నడియాద్‌ వాలా నిర్మిస్తున్న సినిమానే రంగూన్. ఈ సినిమాకు విశాల్‌ భరద్వాజ్‌ దర్శకుడు. ఇందులో కంగనా రనౌత్ జూలియా అనే సినిమా నటి పాత్రను పోషిస్తుంది. ముఫై దశకంలో  'హంటర్వాలే' సినిమాలో స్టంట్‌ క్వీన్‌గా రూపొందిన నాదియాను తలదన్నేలా కంగానా పాత్ర ఉంటుందని విశాల్ భరద్వాజ్ పోల్చి తెలిపాడు.
 
వాడియా మూవీటోన్‌కు చెందిన పెక్కు సినిమాలలో వీర వనితగా నటించి పేరు తెచ్చుకున్న నాదియా, ఆ సంస్థ అధిపతి హోమీ వాడియాను 1961లో పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ రంగూన్ సినిమాలో తనను నటిగా తీర్చిదిద్దిన నిర్మాత కబీర్ ఖన్నాతో జూలియా ప్రేమలో పడుతుంది. ఆ పాత్రను సైఫ్‌ ఆలీఖాన్‌ పోషిస్తున్నాడు. 
 
ఆ తర్వాత బ్రిటీష్‌ నేతృత్వంలో సైనికులకి, ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీకి జరిగిన యుద్ధం జరిగిన కాలంలో మన్యాషెర్గిల్‌ అనే సైనికుడికి జూలియా మనసిస్తుంది. ఆ సైనికుడి పాత్రను షాహిద్‌ కపూర్‌ పోషిస్తున్నాడు. షాహిద్ కపూర్‌కు విశాల్ భరద్వాజ్‌తో కలిసి పనిచేయడం ఇదో రెండోసారి. ఈ రంగూన్‌ సినిమా ఫిబ్రవరి 24న దేశవ్యాప్తంగా విడుదల కానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

రూ.25 లక్షలు లంచం పుచ్చుకుంటూ పట్టుబడిన డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్

అడ్వాన్స్‌డ్ మిలిటరీ టెక్నాలజీ కలిగిన దేశాల జాబితాలో భారత్.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments