Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌వాన్‌లో మ‌రోసారి లుంగీ డాన్స్‌తో షారూఖ్ ఖాన్‌, ప్రియ‌మ‌ణి

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2023 (12:07 IST)
Shahrukh Khan, Priyamani
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌కి లుంగీతో ఉన్న అనుబంధం ఎంతో ప్ర‌త్యేక‌మైంది. గ‌తంలో ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో లుంగీ డాన్స్ సాంగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అప్పుడే కాదు రీసెంట్‌గా రిలీజైన జ‌వాన్ సినిమాలో దుమ్మే దులిపేలా ... సాంగ్‌లోనూ లుంగీతో షారూఖ్‌కి ఉన్న అనుబంధం మ‌రోసారి తేట తెల్ల‌మైంది. ఈ సాంగ్ మ్యూజిక్ చార్ట్స్‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా పాట‌కు త‌గ్గ‌ట్టే నిజంగా టాప్‌లో ఉండి దుమ్ము దులుపుతోంది.
 
యాదృచ్చికంగానే జ‌రిగినా లుంగీ క‌ట్టుకుని డాన్స్ చేయ‌టం అనేది షారూఖ్‌కి ల‌క్ అనే చెప్పాలి. షారూక్‌ఖాన్ ప‌వ‌ర్‌తో పాటు లుంగీ కూడా ల‌క్ కూడా తోడైంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.  కేవ‌లం షారూఖ్ మాత్ర‌మే కాదు.. వెనుక ఉండే వెయ్యి మందికి పైగా బ్యాగ్రౌండ్ డాన్స‌ర్స్ సైతం లుంగీ క‌ట్టుకుని డాన్స్ చేయ‌టం వ‌ల్ల పాట‌కు ఓ ప్ర‌త్యేక‌మైన స్టైల్ క్రియేట్ అయ్యింది. ఈ పాట‌లో మ‌రో అనుకోకుండా క‌లిసి వ‌చ్చిన మ‌రో విష‌య‌మేమంటే ఇందులో ప్రియ‌మ‌ణి కూడా ఉండ‌టం. చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ఆమె షారూఖ్‌తో క‌లిసి లుంగీ డాన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి ఆమె కింగ్ ఖాన్‌తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. 1,2,3,4 గెట్ ఆన్ ది డాన్స్ ఫ్లోర్ అంటూ షారూక్, ప్రియ‌మ‌ణిని మ‌రోసారి చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయ‌బోతున్నారు.
 
లార్జ‌ర్ దేన్ లైఫ్ విజువ‌ల్స్‌, పాజిటివ్ ఎన‌ర్జీతో ఈ పాట షారూఖ్‌కి మ్యూజిక్‌పై ఉన్న క‌నెక్ష‌న్‌ను ఎలివేట్ చేస్తోంది. ఈ పాట‌కు 24 గంట‌ల్లోనే 46 మిలియ‌న్ వ్యూస్ రావ‌టం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ ఈ సినిమాకు స‌హ నిర్మాత‌. సెప్టెంబ‌ర్ 7న ‘జ‌వాన్‌’ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్టిక్ ఐస్ క్రీంలో చనిపోయిన పాము.. ఎంత పెద్ద కళ్ళు..?: ఫోటో వైరల్

తెలంగాణ సింగానికి అదిరిపోయే వీడ్కోలు పలికిన సహచరులు!! (Video)

వలపు వల పేరుతో 36 మందిని బురిడీ కొట్టించిన కిలేడీ!

జడ్జి వద్ద విలపించిన పోసాని... తప్పుడు కేసులతో రాష్ట్రమంతా తిప్పుతున్నారు...

కాంగ్రెస్ పార్టీలో వుంటూ బీజేపీకి పనిచేస్తారా? తాట తీస్తాం.. వారు ఆసియా సింహాలు: రాహుల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments