ఇది ఆరంభం మాత్రమే.. నేను విలనైతే... : జవాన్ ట్రైలర్ రిలీజ్

Webdunia
సోమవారం, 10 జులై 2023 (15:51 IST)
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం "జవాన్". ఇటీవల "పఠాన్" సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన షారూక్.. ఇపుడు "జవాన్‌"గా ప్రేక్షకుల ముందుకురానున్నారు. కోలీవుడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆరంభమే అదిరిపోయింది. 
 
"ఎవరు నేను?, ఎవర్నీ కాదు. తల్లికిచ్చిన మాట కావొచ్చు. నెరవేరని లక్ష్యం కావొచ్చు. నేను మంచివాడినా?.. చెడ్డవాడినా?, పుణ్యాత్ముడినా?, పాపాత్ముడినా?.. నీకు నువ్వే తెలుసుకో. ఎందుకంటే నేనే నువ్వు.. రెఢీ." అనే డైలాగ్‌తో ట్రైలర్ ఆరంభమవుతుంది. చివరి కాదా వరుసబెట్టి యాక్షన్ సీన్లతో నిండిపోయింది. 
 
ఇక చివర్లలో "ఇది ఆరంభం మాత్రమే. నేను విలనైతే.. ఏ హీరో నా ముందు నిలబడలేదు" అంటూ షారూక్ చెప్పిన డైలాగ్ ఈ ప్రివ్యూ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. ఇందులో షారూక్ గుండుతో కనిపించడం గమనార్హం. 
 
అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చారు. ఇది కూడా మరో లెవల్‌లో ఉంది. ఇందులో విజయ్ సేతుపతి, నయనతార, దీపికా పదుకొణె వంటి స్టార్లు నటించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్  బ్యానరుపై నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 7వ తేదీన విడుదలకానుంది. హిందీ, తెలుగు, తమిళం భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు బాంబు పేలుడు - వీడియోలు షేర్ చేసి పైశాచికానందం - అస్సాం సర్కారు ఉక్కుపాదం

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నవంబర్ 17 నుంచి భారీ వర్షాలు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో లగేజ్ చెకింగ్ పాయింట్ వద్ద కుప్పకూలిన వ్యక్తి (video)

AP Gateway: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వ్యాపారవేత్తలకు ఆహ్వానం.. చంద్రబాబు

రక్షిత మంగళం పేట అటవీ భూముల ఆక్రమణ.. పెద్దిరెడ్డికి సంబంధం.. పవన్ సీరియస్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments