Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజంగా.. ఆ కవిత పవన్‌ని టార్గెట్ చేసిందా? మీ పని మీరు చూస్కోండి: రేణూ దేశాయ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై జనసేనాని పవన్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ మండిపడ్డారు. ''డాలర్-ఏ ఫిగర్ ఆప్ స్పీచ్'' అనే పేరుతో యూట్యూబ్‌లో రేణూ దేశాయ్ పోస్టు చేసిన కవితపై పవన్ ఫ్యాన్స్ మండిప

Webdunia
శనివారం, 3 మార్చి 2018 (15:34 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై జనసేనాని పవన్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ మండిపడ్డారు. ''డాలర్-ఏ ఫిగర్ ఆప్ స్పీచ్'' అనే పేరుతో యూట్యూబ్‌లో రేణూ దేశాయ్ పోస్టు చేసిన కవితపై పవన్ ఫ్యాన్స్ మండిపడ్డారు. మనసు పొరల్లో సమాధి కాబడిన జ్ఞాపకాలు అంటూ.. ఆ జ్ఞాపకాలను మళ్లీ చూసుకుంటున్నానని.. ఆయన మాటలు, పదాలు, ఆయన పేరు నా మదిలో చెరిగిపోని రాతలుగా మిగిలియాంటూ ఓ కవితను రేణూ దేశాయ్ పోస్టు చేశారు. 
 
ఇప్పటికీ అవన్నీ తన మనస్సులో నిలిచిపోయాయని.. విధి అనేది ఆ జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ ఎందుకు నిద్దుర లేపుతుందని.. రేణూ దేశాయ్ తన బాధను కవిత రూపంలో రాసుకుంది. కానీ ఈ కవిత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించినవేనని.. ఇలాంటి వీడియోలు రేణూ దేశాయ్ పోస్టు చేయడం ద్వారా ఆయన వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతోందని పవన్ ఫ్యాన్స్ మండిపడ్డారు. 
 
రేణు దేశాయ్ వల్లే పవణ్ కల్యాణ్ రాజకీయ పార్టీలకు టార్గెట్ అవుతున్నారని ట్వీట్ చేశారు. దీంతో రేణూ దేశాయ్ పీకే ఫ్యాన్స్‌పై మండిపడ్డారు. తాను చేసిన కవిత పవన్ కల్యాణ్‌ను ఎలా టార్గెట్ చేస్తుందని ప్రశ్నించారు. మీ పని మీరు చూసుకోవాలన్నారు. తన సోషల్ మీడియాలోకి ప్రవేశించి.. ఏదో ఒకటి పోస్టు చేస్తూ.. తనను కామెంట్ చేయవద్దన్నారు. 
 
ఈ ట్వీట్‌ను కూడా రాద్దాంతం చేస్తారనే విషయం తెలుసునని రేణూ చెప్పారు. సంగం నాలెడ్జ్‌తో మీరు ట్వీట్లు చేస్తారని, మీరు ఏదో చెబితే, మీడియా దాన్ని పూర్తిగా హైలైట్ చేస్తోందని విమర్శించారు. పవన్ గురించి ఎలాంటి విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని కోరారు.
 

సంబంధిత వార్తలు

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

సంసారం ఎలా సాగుతుందని అడిగేవారు.. పక్కన కూర్చోకపోతే..?

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments