Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు.. బిడ్డతో సంతోషంగా వున్నా.. సురేఖా వాణి

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (10:00 IST)
క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి రెండో పెళ్లిపై ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల రెండో వివాహం చేసుకున్న సింగర్ సునీత తరహాలోనే సురేఖ కూడా రెండో పెళ్లి చేసుకుంటోందంటూ వార్తలు వచ్చాయి. సురేఖ వాణి కుమార్తె సుప్రీత కూడా తన తల్లి రెండో పెళ్లి గురించి సుముఖంగా ఉందని, ఆమె కూడా సురేఖ రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందంటూ ఇలా రకరకాలుగా వార్తలు వచ్చాయి. 
 
ఈ వార్తలపై సురేఖా వాణి స్పందించింది. తన జీవితంలో ఒకేసారిపెళ్లి అని స్పష్టం చేశారు. మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టే ఆలోచన తనకు లేదని తేల్చి చెప్పారు. తన బిడ్డతో సంతోషంగా ఉన్నానని చెప్పారు.
 
2019లో అనారోగ్యం కారణంగా సురేఖ వాణి భర్త సురేష్ తేజ మరణించిన సంగతి తెలిసిందే. వీరిద్దరిది ప్రేమ వివాహం. సురేష్ నటుడుగా చేశారు. అనేక తెలుగు టీవీ ప్రొగ్రామ్స్, టీవీ షోలకు డైరెక్టర్‌గా పనిచేశారు. మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ వంటి ప్రోగామ్స్‌కు దరకత్వం వహించారు. సురేఖ వాణి ఆ సమయంలోనే యాంకర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 
 
ఆ సమయంలో బుల్లితెరపై డెరెక్టర్ ఉన్న సూర్య ఆమెను ప్రెమించి పెళ్ళి చేసుకున్నారు. భర్త చనిపోయిన తర్వాత సురేఖకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. సీనియర్ హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టీస్‌లుగా మారుతూ వస్తుండడంతో సురేఖ క్రమంగా సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు.
 
సోషల్ మీడియాలో కూతురుతో కలిసి అప్పుడప్పుడు యాక్టివ్‌గా కనిపిస్తున్న లోపల బాధ మాత్రం అలాగే ఉండిపోయింది. సురేఖవాణి బాధను చూసిన ఆమె కూతురు మళ్ళీ పెళ్ళి చేసుకోమనే ప్రపోజల్ పెట్టిందంట. ఇటీవలే టాలీవుడ్ సింగర్ సునీత రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అదే బాటలో నడవాలని సురేఖ వాణికి ఆమె కూతురు సూచించిదట. అయితే, ఈ వార్తలకు సురేఖవాణి అధికారికంగా బ్రేక్ వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Male Dwakra: మహిళలకే కాదు.. ఇక పురుషులకు కూడా డ్వాక్రా.. ఏపీ సర్కార్

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments