Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నా వ్యాఖ్యలు నాకే వెగటు పుట్టించాయి.. పదేపదే చూపించి చరిత్రహీనుడిగా చేయొద్దు'.. చలపతిరావు లేఖ

'అమ్మాయిలు హానికరమా' అంటూ ఓ మహిళా యాంకర్ అడిగిన ప్రశ్నకు సీనియర్ నటుడు చలపతిరావు చెప్పిన సమాధానం... పెనువివాదంగా మారింది. ఈ వ్యాఖ్యలపై మహిళాలోకం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. పైగా, ఆయనపై కేసులు

Webdunia
బుధవారం, 24 మే 2017 (11:48 IST)
'అమ్మాయిలు హానికరమా' అంటూ ఓ మహిళా యాంకర్ అడిగిన ప్రశ్నకు సీనియర్ నటుడు చలపతిరావు చెప్పిన సమాధానం... పెనువివాదంగా మారింది. ఈ వ్యాఖ్యలపై మహిళాలోకం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. పైగా, ఆయనపై కేసులు కూడా పెట్టారు. దీంతో చలపతిరావు దిగివచ్చి.. మహిళా లోకానికి సారీ చెపుతూ ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలోని సారాంశాన్ని పరిశీలిస్తే...
 
"73 యేళ్ళ వయసులో, 50 సంవత్సరాల సినీ జీవితంలో, అనాలోచితంగా, అన్యోపదేశంగా నేను చేసిన ఒక వ్యాఖ్య దురదృష్టకరం. ఒక మహిళా వ్యాఖ్యాత అడిగిన ప్రశ్న ఇది. ‘ఆడవాళ్లతో హానికరమా?’ అన్న ప్రశ్నకు జవాబుగా నేను ‘ఆడవాళ్లు హానికరం కాదు’ అన్నాను. ఆ తరువాత నేను చేసిన ఒక వ్యాఖ్యను టీవీల్లో పదేపదే ప్రసారం చేసి నన్ను ఒక చరిత్ర హీనుడిగా మార్చేసిన పరిస్థితి పట్ల నేను బాధపడుతున్నాను. నిజమే నా వ్యాఖ్యలు నాకే వెగటు పుట్టించాయి. అవి నేను చేయకుండా ఉండాల్సింది. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరమే కాదు, ఆక్షేపణీయం కూడా. అందుకు నేను ఎటువంటి షరతులు లేకుండా క్షమాపణలు చెబుతున్నాను. 
 
ఇదే సందర్భంలో నాదొక చిన్న మనవి. సినిమాల్లో, టీవీల్లో చివరాఖరికి, ఇప్పటి సామాజిక మాధ్యమాల్లో, మహిళల్ని కించపరిచే మాటలకు, దృశ్య శ్రవణాలకు మనందరం బాధ్యులమే! పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా! ఆ విషయం మనందరికీ తెలుసు. నాతో పాటు అందరం దీనికి బాధ్యత వహించాల్సిందే. సినిమాల్లో చూపించే దృశ్యాలు, చెప్పేమాటలకు పరిశ్రమలోని రచయితలు, నిర్మాతలు, దర్శకులు, నటులు అందరం బాధ్యత వహించాలి. ఇకముందు నేనే కాదు, మరెవ్వరూ ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితికి కారణం కాకూడదు.
 
నా మాటలకు, వ్యాఖ్యలకు అందరికీ,
మరోసారి క్షమాపణలు చెబుతున్నాను.
మన్నించండి!
మీ
చలపతిరావు' అని ఆ లేఖలో పేర్కొన్నారు.

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments