'అలా.. వైకుంఠపురం' నటుడు ఉపేంద్రపై కేసు నమోదు

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (10:47 IST)
అల్లు అర్జున్ 'అలా.. వైకుంఠపురం'లో నటించిన కన్నడ నటుడు ఉపేంద్రపై కేసు నమోదైంది. తన రాజకీయ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా సోషల్‌ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దళితులను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ బెంగళూరులో కేసు నమోదు అయ్యింది.
 
'ప్రజాకీయా' వార్షికోత్సవంలో భాగంగా ఉపేంద్ర శనివారం ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా లైవ్‌ నిర్వహించారు. విమర్శకులను ఓ వర్గంతో పోలుస్తూ ఆయన సామెతలు చెప్పారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో ఉపేంద్ర వ్యాఖ్యలు తమని ఆవేదనకు గురి చేశాయంటూ ఆదివారం బెంగళూరులోని చెన్నమన్నకేరే అచ్చుకట్టు పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు ఉపేంద్రపై కేసు నమోదు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు సౌత్‌ బెంగళూరు డీసీపీ కృష్ణకాంత్‌ తెలిపారు.
 
తన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ఉపేంద్ర క్షమాపణలు చెప్పారు. లైవ్‌ వీడియోను సైతం తన సామాజిక మాధ్యమాల నుంచి తొలగించారు. 'ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా లైవ్‌లో పొరపాటున నోరు జారి కొన్ని వ్యాఖ్యలు చేశాను. నా వ్యాఖ్యల కారణంగా కొంతమంది ఇబ్బందిపడ్డారని గ్రహించిన వెంటనే లైవ్‌ వీడియోను తొలగించాను. ఆ విధంగా వ్యాఖ్యలు చేసినందుకు నన్ను క్షమించండి' అంటూ ఆయన పోస్ట్‌ పెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ప్రతి 50 కిమీకి ఒక పోర్టు నిర్మాణం : సీఎం చంద్రబాబు

Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో కేవలం 47 శాతం పోలింగ్ మాత్రమే నమోదు

కొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన యూఐడీఏఐ

ఢిల్లీ పేలుళ్ళ వెనుక రెసిడెంట్ డాక్టర్ - పోలీసుల అదుపులో ఫ్యామిలీ మెంబర్స్

ఎర్రకోట మెట్రో స్టేషన్ పేలుడు.. 12కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

తర్వాతి కథనం
Show comments