సైరా సినిమాలో నటించే అవకాశాన్ని పొందిన కోలీవుడ్ క్రేజ్ హీరో విజయ్ సేతుపతి తాజా సినిమాలో అఖిల్ సినిమా హీరోయిన్ సాయేషా సైగల్ హీరోయిన్‌గా నటించనుంది. ఇప్పటికే విజయ్ సేతుపతి సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ
సైరా సినిమాలో నటించే అవకాశాన్ని పొందిన కోలీవుడ్ క్రేజ్ హీరో విజయ్ సేతుపతి తాజా సినిమాలో అఖిల్ సినిమా హీరోయిన్ సాయేషా సైగల్ హీరోయిన్‌గా నటించనుంది. ఇప్పటికే విజయ్ సేతుపతి సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
'విక్రమ్ వేదా' సినిమాతో క్రేజ్ మరింత పెంచుకున్న విజయ్ సేతుపతి, గోకుల్ దర్శకత్వంలో 'జుంగా' సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా సాయేషా సైగల్‌ను తీసుకున్నారు. ఈ సినిమా షూటింగులో ఎక్కువ భాగాన్ని పారిస్‌లో ప్లాన్ చేసినట్టు సమాచారం. త్వరలో సాయేషా విజయ్ సేతుపతి షూటింగ్‌లో పాల్గొననుంది.
కాగా.. తెలుగుతెరకి 'అఖిల్' సినిమాతో పరిచయమైన సాయేషా సైగల్ గ్లామర్ పరంగా యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆపై టాలీవుడ్‌లో అవకాశాలు లేకపోవడంతో కోలీవుడ్‌పై దృష్టిపెట్టింది. ఇప్పటికే కోలీవుడ్ జయం రవి హీరోగా నటించిన వనమగన్ చిత్రంలో సాయేషా అద్భుతంగా నటించింది. ఇటీవలే విశాల్-కార్తీ సినిమాను కూడా అంగీకరించింది.