Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సైరా'' విజయ్ సేతుపతితో సాయేషా సైగల్...

సైరా సినిమాలో నటించే అవకాశాన్ని పొందిన కోలీవుడ్ క్రేజ్ హీరో విజయ్ సేతుపతి తాజా సినిమాలో అఖిల్ సినిమా హీరోయిన్ సాయేషా సైగల్ హీరోయిన్‌గా నటించనుంది. ఇప్పటికే విజయ్ సేతుపతి సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (11:35 IST)
సైరా సినిమాలో నటించే అవకాశాన్ని పొందిన కోలీవుడ్ క్రేజ్ హీరో విజయ్ సేతుపతి తాజా సినిమాలో అఖిల్ సినిమా హీరోయిన్ సాయేషా సైగల్ హీరోయిన్‌గా నటించనుంది. ఇప్పటికే విజయ్ సేతుపతి సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

'విక్రమ్ వేదా' సినిమాతో క్రేజ్‌ మరింత పెంచుకున్న విజయ్ సేతుపతి, గోకుల్ దర్శకత్వంలో 'జుంగా' సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా సాయేషా సైగల్‌ను తీసుకున్నారు. ఈ సినిమా షూటింగులో ఎక్కువ భాగాన్ని పారిస్‌లో ప్లాన్ చేసినట్టు సమాచారం. త్వరలో సాయేషా విజయ్ సేతుపతి షూటింగ్‌లో పాల్గొననుంది. 
 
కాగా.. తెలుగుతెరకి 'అఖిల్' సినిమాతో పరిచయమైన సాయేషా సైగల్ గ్లామర్ పరంగా యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆపై టాలీవుడ్‌లో అవకాశాలు లేకపోవడంతో కోలీవుడ్‌పై దృష్టిపెట్టింది. ఇప్పటికే కోలీవుడ్ జయం రవి హీరోగా నటించిన వనమగన్ చిత్రంలో సాయేషా అద్భుతంగా నటించింది. ఇటీవలే విశాల్-కార్తీ సినిమాను కూడా అంగీకరించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments