Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోసం చేస్తున్న సాయిధ‌ర‌మ్ తేజ్!

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (22:44 IST)
Sai tej letter
న‌టుడు సాయిధ‌ర‌మ్‌తేజ్ మోసం చేస్తున్నాడు. సినీ రంగంలో ప‌రిచ‌యం వున్న వారినుంచి డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నాడు. నేరుగా కాకుండా ఆన్‌లైన్‌లో డ‌బ్బులు వేయండి కోవిడ్ పేషెంట్ల‌ను కాపాడండి. అంటూ వేడుకుంటున్నాడు. ఇది జ‌రిగిన సంగ‌తి.
 
ఇటీవ‌లే కొంద‌రు సినీహీరోలు కోవిడ్ పేషెంట్ల కోసం ఆక్సిజ‌న్ ఇత‌ర‌త్రా సౌక‌ర్యాలు క‌ల్పించ‌డానికి త‌మ వంతు సాయంగా స్వ‌చ్చంధ సంస్థ‌ల‌తో క‌లిసి సేవ చేస్తున్నారు. నిన్న‌నే రానా కూడా ఫ‌లానా సంస్థ‌కు సాయం చేయండి అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అయితే ఇలాంటి వాటిని దుర్వినియోగం చేస్తూ ఓ టీమ్ బ‌య‌లుదేరింది. అదే సాయిధ‌ర‌మ్ తేజ్‌.
 
అస‌లు ఈయ‌న హీరో సాయిథ‌ర‌మ్ తేజ్ కాదు. అలా పేరు చెప్పుకుని ఓ ఫేక్ ఐడీతో ఆన్‌లైన్ మోసాలు చేస్తున్నాడు ఓ వ్య‌క్తి. ఈ విష‌యం తెలిసిన సాయితేజ్ శుక్ర‌వారం రాత్రి క్లారిటీ ఇచ్చాడు. ఆయ‌న సోష‌ల్‌మీడియాలో పెట్టిన విష‌యం ఇలా వుంది.
 
"ఓ వ్యక్తి నాలా మారి, నాకు తెలిసిన కొంతమందితో టచ్ లోకి వెళ్తున్నాడు.. నాతో కలిసి నటించిన వాళ్లకు, ఇండస్ట్రీలో ఇతరులకు ఫోన్లు చేసి ఆర్థిక సాయం అడుగుతున్నాడు. దీనికి సంబంధించి చట్టపరమైన చర్యలకు సిద్ధమౌతున్నాను. నా పేరు చెప్పి డబ్బులు అడుగుతున్న అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి` అంటూ క్లారిటీ ఇచ్చాడు.
 
ఇదిలా వుండ‌గా, సాయితేజ్‌కు ఉదార‌గుణం వుంది. గ‌తంలో ప‌లువురికి సాయం చేసిన దాఖ‌లాలు వున్నాయి. దీన్ని ఆస‌రాగా చేసుకుని ఆయ‌న గురించి బాగా తెలిసిన‌వారే ఇలాంటి చ‌ర్య‌కు పాల్ప‌డిన‌ట్లు ఫిలింన‌గ‌ర్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: నల్గొండ: 12ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడిని మరణశిక్ష

చెంచుగూడెంలో మూడేళ్ల చిన్నారిని ఈడ్చెకెళ్లిన చిరుత!!

నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని పరువు హత్య!!

Heavy rains: విజయవాడలో భారీ వర్షాలు- డ్రైనేజీలో పడిపోయిన వ్యక్తి మృతి

ఏపీలో కుండపోత వర్షం - వచ్చే 24 గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments