Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సుదర్శన చక్రం సర్వీసింగ్‌కి ఇచ్చాను'.. లేకుంటేనా... "సవ్యసాచి" ట్రైలర్

Webdunia
గురువారం, 1 నవంబరు 2018 (13:03 IST)
అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం "సవ్యసాచి". ఈ చిత్రంలో తమిళ హీరో మాధవన్ ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. 
 
ఈ సందర్భంగా ఆ చిత్రంలోని 'సుభద్రా పరిణయం' నాటకానికి సంబంధించిన సన్నివేశాన్ని ట్రైలర్‌గా చిత్రబృందం రిలీజ్ చేసింది. జస్ట్ శాంపిల్ మాత్రమే వదిలింది. ఇక ఈ సన్నివేశం చిత్రంలో ఎంత హిలేరియస్‌గా ఉండబోతోందో దీన్ని చూస్తేనే అర్థమవుతుంది.
 
'మన కాలేజ్‌లో సుభద్రా పరిణయం అనే నాటకం ప్రదర్శించనున్నారు' అంటూ విద్యు రామన్ చెప్పే సీన్‌తో సుభద్రా పరిణయం నాటకం ప్రారంభమవుతుంది. 'కృష్ణా.. బలరాముడంటే రాముడికి చుట్టమా?' అని ధర్మరాజు పాత్రధారి అడగటం.. 'సుదర్శన చక్రం సర్వీసింగ్‌కి ఇచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే నీకుండేదిరా దరిద్రుడా' అంటూ కృష్ణుడి పాత్రధారి వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్స్ బాగా నవ్వించాయి. 
 
ఇందులో మొత్తం మూడు రౌండ్లు ఉంటాయని హైపర్ ఆది చెప్పగా.. 'బలరామ్ బావా నాకు రెండు రౌండ్లకే కళ్లు తిరుగుతాయి' అని చైతు అనడంతో ఇవి ఆ రౌండ్లు కాదులే అని బలరాముడు పాత్రధారి హైపర్ ఆది బదులిస్తాడు.. అలా మొత్తానికి సుభద్రా పరిణయాన్ని బాగా రక్తికట్టించారు ఈ సవ్యసాచి బృందం. మరి శుక్రవారం విడుదలయ్యే ఈ చిత్రం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments