Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహానటి' కోసం ఎంతో చేశాను.. కనీసం థ్యాంక్స్ కార్డు కూడా వేయలేదు : సంజయ్ కిషోర్

'మ‌హాన‌టి' సినిమా తెలుగు, త‌మిళంలో రిలీజై విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో రికార్డు స్థాయి వసూళ్ళను రాబడుతోంది. బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోన్న ఈ టైమ్‌లో అస‌లు.. బ‌యోపిక్ అంటే ఇలా ఉండాలి అనేలా మ‌హాన‌టి చిత్రాన

Webdunia
ఆదివారం, 27 మే 2018 (15:15 IST)
'మ‌హాన‌టి' సినిమా తెలుగు, త‌మిళంలో రిలీజై విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో రికార్డు స్థాయి వసూళ్ళను రాబడుతోంది. బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోన్న ఈ టైమ్‌లో అస‌లు.. బ‌యోపిక్ అంటే ఇలా ఉండాలి అనేలా మ‌హాన‌టి చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. అయితే... ఈ సినిమా ఇంత అద్భుతంగా రావ‌డానికి తెర వెన‌ుక ఎంతో మంది కృషి ఉంది. సావిత్రి గారి వీరాభిమానిగా.. ఆమె పేరుతో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించిన సినీ ప్రేమికుడు సంజయ్ కిషోర్.
 
ఆయన తాజాగా ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సావిత్రికి సంబంధించి ఎవరు ఎలాంటి ప్రయత్నాన్ని ప్రారంభించినా, అందుకు సంబంధించిన సమాచారం విషయంలో నా పేరు ప్రస్తావనకు వస్తుంటుంది. దర్శకుడు నాగ్ అశ్విన్‌తో పాటు ఆయన టీమ్ సభ్యులు వచ్చి నన్ను కలుసుకున్నారు. ఆమెకి సంబంధించి నా దగ్గరున్న మెటీరియల్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. 
 
వాళ్లకి కావలసినవి తీసుకుని వెళ్లారు. నేను సంపాదించడానికే ఎన్నో యేళ్లు పట్టింది. ఇంత కష్టపడి సేకరించిన మెటీరియల్‌తో వాళ్లకి సహకరిస్తే కనీసం థ్యాంక్స్ కార్డు కూడా వేయలేదు. ఆర్థికంగా నేనేం ఆశించలేదు. థ్యాంక్స్ కార్డు వేసుంటే హ్యాపీగా వుండేది. ఏదిఏమైనా... వాళ్ల ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను అని చెప్పారు. మ‌రి... సంజ‌య్ కిషోర్ కామెంట్‌పై మ‌హాన‌టి టీమ్ స్పందిస్తుందేమో చూడాలి. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments