Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

దేవీ
శుక్రవారం, 28 నవంబరు 2025 (15:01 IST)
Savitri 90th birth anniversary
సావిత్రి 90 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో ఓ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం చేస్తున్నట్లు ఆమె కుమార్తె  విజయచాముండేశ్వరి పేర్కొన్నారు. చెన్నైలో వుంటున్న ఆమె తన తల్లి జయంతి సందర్భంగా తెలుగు చలనచిత్ర రంగంలో పెనవేసుకున్న అభిమానుల కోసం ఈ కార్యక్రమం చేయనున్నట్లు తెలిపారు.
 
మా మాతృమూర్తీ, మహానటీ అయిన శ్రీమతి సావిత్రి గారి 90వ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్రభారతిలో డిసెంబర్ 1 నుంచి 6 వరకు ‘సావిత్రి మహోత్సవ్' పేరిట నిర్వహిస్తున్నాము. ప్రముఖ కళా సంస్థ “ సంగమం” ఫౌండేషన్ తో కలిసి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో డిసెంబర్ 1 నుంచి 5 వరకు సావిత్రి గారి సినిమాల ప్రదర్శన, పాటల పోటీలు ఉంటాయి. డిసెంబర్ 6న జరిగే సావిత్రి 90 వ జయంతి సభలో 'మహానటి' చిత్ర దర్శక నిర్మాతలైన నాగ్ అశ్విన్, ప్రియాంకాదత్, స్వప్నాదత్ లనూ, 'సావిత్రి క్లాసిక్స్' పుస్తక రచయిత సంజయ్ కిషోర్, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్య లనూ ప్రత్యేకంగా సత్కరిస్తున్నాము. మండలి బుద్ధప్రసాద్ గారి అధ్యక్షతన జరిగే ఈ సభకి భారత పూర్వ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా, చలన చిత్ర ప్రముఖులు ఆత్మీయ అతిథులుగా విచ్చేయనున్నారు అని విజయచాముండేశ్వరి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇకపై ఇంటి వద్దే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేషన్

Laddu Ghee Case: తిరుమల లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి.. టీటీడీ ఇంజనీరింగ్ అధికారి అరెస్ట్

ఐఏఎస్ శ్రీలక్ష్మిపై అక్రమాస్తుల కేసును కొట్టేయొద్దు

ఓ ఇంటర్వ్యూ పాత పగను రగిల్చింది... మాజీ నక్సలైట్‌ను హత్య

పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ.. పాక్ పౌరులకు వీసాలు నిలిపివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments