Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివమ్ మీడియా నుంచి సత్య రాబోతుంది

డీవీ
గురువారం, 4 ఏప్రియల్ 2024 (15:41 IST)
amaresh,sathya
తమిళంలో రూపిందిన 'సత్య సినిమా తెలుగులో శివమ్ మీడియా విడుదల చేస్తుంది. ఈ చిత్రం గురించి డైరక్టర్ వాలి మోహన్ దాస్ మాట్లాడుతూ: తనకి తెలుగు అంటే చాలా ఇష్టం. ఇలాంటి ఒక heartful film, చేసినందుకు నాకు చాలా హ్యాపీ గా ఉంది. అందరూ చాలా బాగా చేశారు. సత్య సినిమా నాకు చాలా స్పెషల్ ఎందుకంటే ఇది నా మొదటి సినిమా, మొదటి హీరో, మొదటి హీరోయిన్, మొదటి ప్రొడ్యూసర్.. నా అనుభవం నుండి తీసిన కథ ఇది అని చెప్పారు..
 
తెలుగులో సత్య సినిమాకి మాటలు అందిచిన K.N విజయ్ కుమార్ మాట్లాడుతూ: సత్య ఒక సినిమాలాగా ఉండదు ప్రతీది కూడా చాలా లైవ్ గా ఉంటుంది.. ఎన్నో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, ఒకరు ఇద్దరు తప్ప అందరూ ఈ సినిమాలో కొత్తవారే, మొదటి సారి డైరక్టర్ అయినప్పటికీ వాలి మోహన్ దాస్ చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఈ సినీమా చుస్తున్నత సేపు ఏదో సినిమా చూసాం అని అనిపించదు,  శివ జర్నీ మీరు అందరూ చూస్తారు.. పైగ స్టూడెంట్స్  అందరూ ఆలోచిస్తారు. ప్రొడ్యూసర్ శివ మల్లాల గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను నమ్మినందుకు రుణ పడి ఉంటాను..అన్నారు. 
 
Sathya team
నిర్మాత సతీష్ మాట్లాడుతూ: తెలుగువాడిని అయిన నేను  చెన్నైలో స్థిరపడ్డాను.. శివకి సినీమా చూపించాను.. వెంటనే  ‘అన్న ఈ సినీమా నేను తెలుగులో రిలీజ్ చేస్తాను’ అని చెప్పారు, నిజానికి ఇలా నాతో చాలా మంది అన్నారు శివ కూడా అలానే అనుకున్నాను కాని సినిమా రిలీజ్ అప్పుడు వచ్చి స్టేజి మీద ఈ సినిమాని తెలుగులో మేము రిలీజ్ చేస్తున్నాం అన్నారు, అప్పుడు శివ సీరియస్ గానే అన్నాడని అర్ధమైంది.. ఆ తరవాత ఇదిగోండి ఈరోజు ఇలా ఉన్నాం.. హమరేష్ "విక్రమ్: హరోగా చేసిన "నాన్న" మూవీ లవ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా, లోకేష్ కనగరాజ్ నగరంలో, ప్రియదర్శి గారు దర్శకత్వంలో సినిమాలు చేశాడు. అప్పుడు హమరేష్ లో ఉన్న passion  నాకు అర్ధం కాలేదు, పోను పోను తను పెట్టె ఎఫర్ట్ అర్ధమై, గోపురం ప్రొడక్షన్స్ లో రంగోలి పేరుతో ఈ సినిమాని స్టార్ట్ చేశాం, పెద్ద సక్సెస్ అయ్యింది.. అందుకే అందరం సపోర్ట్ చేస్తున్నాం.. తెలుగు ఇండస్ట్రీ చాలా మందిని ఆదరించింది, అలాగే అమారేష్ నీ కూడా ఆదరిస్తుంది అనుకుంటున్నాను. అన్నారు. 
 
శివమ్ మీడియా అధినేత శివ మల్లాల మాట్లాడుతూ.. ఈసినిమా కొసం అన్ని అవే కలిసొచ్చాయి.. ఈరోజు మన ఈవెంట్ జరగాలిసిన టైం లో ఇక్కడ ఫ్యామిలీ స్టార్ స్క్రీనింగ్ జరిగింది.. దిల్ రాజ్ గారు అంటే నాకు చాలా ఇష్టం అయన కష్టపడి ఎదిగిన విధానం నాకు ఒక ఇన్స్పిరేషన్..  దిల్ రాజు గారు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ కూడా ఈరోజు అమరేషను, ప్రార్థన సందీప్ ని విష్ చేశారు. నాన్న అంటే ఎవరికీ ఇష్టం ఉండదు.. నాకు నాన్న లేరు, అందుకని నాకు అయన విలువ బాగా తెలుసు, అందరు పిల్లలు నాన్న మనకి ఏం ఇచ్చారు అనుకుంటారు, కాని నా సినిమాలో హీరో సత్య మాత్రం నేను నాన్నకి ఏమన్నా ఇవ్వాలి అని, అనుకుంటే ఏమన్నా చెయ్యగలను అని తన జర్నీ ని స్టార్ట్ చేశారు. ఈ సినిమాని చాలా మంది నిర్మాతలు తెలుగులో చేస్తాం అని అడిగారు కాని సతీష్ గారు నేను శివకి మాట ఇచ్చాను అని, నన్ను నమ్మి నాకు ఈ సినిమా ఇచ్చారు, ఎన్నో సినిమాలకి రివ్యూస్ రాసిన నేను, కచ్చితంగా మీ ముందుకు మంచి సినిమానే తీసుకొని వస్తాను.. అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భక్తి-ముక్తి, శక్తి-యుక్తి ఈ 4 అవసరం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో శ్రీశ్రీ రవిశంకర్ (video)

మగవాళ్లపై గృహహింస: ‘పెళ్లైన 15 రోజులకే విడాకులన్నారు, ఇంటికి వెళితే దారుణంగా కొట్టి పంపించారు’

జగన్ థర్డ్ డిగ్రీ నుంచి బీజేపీలో ఉండటంతో తప్పించుకున్నా : విష్ణుకుమార్ రాజు

పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో యువకుడి మృతి..

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కారు డ్రైవర్ నెల వేతనం ఎంతో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments