Webdunia - Bharat's app for daily news and videos

Install App

జులై 1న 'దొర'గా వ‌స్తున్న స‌త్య‌రాజ్

Webdunia
సోమవారం, 13 జూన్ 2016 (18:03 IST)
చ‌క్క‌టి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌లో, తండ్రి పాత్ర‌ల్లో స‌త్య‌రాజ్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న త‌మిళంలో జాక్స‌న్ దొరై అనే చిత్రంలో న‌టించారు. ఈ చిత్రాన్ని ర‌త్నా సెల్యులాయిడ్స్ ప‌తాకంపై జ‌క్కం జ‌వ‌హ‌ర్‌బాబు తెలుగులో 'దొర' అనే టైటిల్‌తో విడుద‌ల చేస్తున్నారు. 
 
ధ‌ర‌ణీ ధ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో స‌త్య‌రాజ్ త‌న‌యుడు శిబిరాజ్ హీరోగా న‌టించారు. బిందుమాధ‌వి నాయిక‌. క‌రుణాక‌ర‌న్‌, స‌హాయం రాజేంద్ర‌న్ ఇత‌ర కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమాలోని పాట‌ల‌ను జూన్ 21న, చిత్రాన్ని జులై 1న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా... నిర్మాత జ‌క్కం జ‌వ‌హ‌ర్‌బాబు మాట్లాడుతూ... 'స‌త్య‌రాజ్‌గారికి తెలుగులో ఉన్న క్రేజ్ మ‌న‌కు తెలిసిందే. తెలుగులో ఆయ‌న ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లో న‌టించారు. త‌మిళంలో పీరియాడిక‌ల్ హ‌ర్ర‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ జాక్స‌న్ దొరై చిత్రంలో న‌టించారు. 
 
ఈ చిత్రాన్ని తెలుగులో 'దొర' పేరుతో అనువ‌దిస్తున్నాం. సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల‌ను జూన్ 21న విడుద‌ల చేసి, సినిమాను తెలుగు, త‌మిళంలో జులై 1న విడుద‌ల చేస్తున్నాం. సిద్ధార్థ్ విపిన్ చాలా మంచి బాణీల‌ను అందించారు. వెన్నెల‌కంటి, చంద్ర‌బోస్‌ చ‌క్క‌టి సాహిత్యంతో పాట‌లు రాశారు. శ‌శాంక్ వెన్నెల‌కంటి అద్భుత‌మైన డైలాగులు రాశారు. ఇటీవ‌లికాలంలో వైవిధ్య‌మైన హార‌ర్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు బాగా ఆద‌రిస్తున్నారు. ఆ కోవ‌లో 'దొర' కూడా త‌ప్ప‌క తెలుగు వారిని ఆక‌ట్టుకుంటుంద‌నే న‌మ్మ‌కం ఉంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ జోన‌ర్ కొత్త‌గా ఉంటుంది' అని చెప్పారు. 
 
ఈ సినిమాకు కెమెరా: యువ‌రాజ్‌, సంగీతం: సిద్ధార్థ్ విపిన్‌, నేప‌థ్య సంగీతం: చిన్నా, పాట‌లు: వెన్నెల‌కంటి, చంద్ర‌బోస్‌, మాట‌లు: శ‌శాంక్ వెన్నెల‌కంటి, ద‌ర్శ‌క‌త్వం: ధ‌ర‌ణీధ‌ర‌న్‌, నిర్మాత‌: జ‌క్కం జ‌వ‌హ‌ర్‌బాబు.​ 

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments