Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాతకర్ణికి చెక్ పెట్టిన శతమానం భవతి కలెక్షన్లు.. నైజాంలో అదుర్స్

తెలుగు జాతి కీర్తించిన చక్రవర్తి గౌతమీ పుత్ర శాతకర్ణి చరిత్ర ఆధారంగా దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన శాతకర్ణి సినిమాలో బాలకృష్ణ నటించారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తోంది. ప్

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (15:45 IST)
తెలుగు జాతి కీర్తించిన చక్రవర్తి గౌతమీ పుత్ర శాతకర్ణి చరిత్ర ఆధారంగా దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన శాతకర్ణి సినిమాలో బాలకృష్ణ నటించారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 1.6 మిలియన్లు కొల్లగొట్టింది. అంతేకాదు బాలయ్య నటించిన 'లెజెండ్' చిత్రం కలెక్షన్లు కూడా దాటిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ రికార్డ్‌ని బద్దలు కొట్టాడు యంగ్ హీరో శర్వానంద్. 
 
బాలయ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం 9.3 కోట్ల షేర్ రాబట్టగా... ఆ తర్వాతి రోజున రిలీజ్ అయిన శర్వానంద్ 'శతమానం భవతి' చిత్రం 9.4కోట్ల షేర్‌ని రాబట్టి రికార్డు సృష్టించింది. బాలయ్య సినిమాల్లో శాతకర్ణి కలెక్షన్ల పరంగా నెం.1 స్థానంలో నిలవగా, నైజాంలో మాత్రం బాలయ్య చిత్రానికంటే కొద్దిగానైనా శర్వానంద్ శతమానం భవితికి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. 
 
సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన శతమానం భవతి చిత్రం కూడా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. తద్వారా 30కోట్ల మార్కుతో శర్వానంద్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు సంపాదించిన చిత్రంగా శతమానం భవతి నిలిచింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

ఆస్తి కోసం కుమార్తె చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి!!

మార్క్ శంకర్ పవనోవిచ్‌ను కాపాడిన వారిని సత్కరించిన సింగపూర్

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments