Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతికి శతమానం భవతి.. శర్వానంద్ 25 సినిమా.. హిట్టేనా?

పల్లెటూరి కథా నేపథ్యంలో, అందమైన కుటుంబ కథా చిత్రంగా శతమానం భవతి తెరకెక్కుతోంది. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (09:20 IST)
పల్లెటూరి కథా నేపథ్యంలో, అందమైన కుటుంబ కథా చిత్రంగా శతమానం భవతి తెరకెక్కుతోంది. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 
 
ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ గ్రామీణ నేపథ్యంలో సాగే మూడు తరాల కథ ఇది. తాతా మనవళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని కొత్త పంథాలో ఆవిష్కరిస్తుంది. కలిసి ఉంటే కలదుసుఖమని నమ్మే ఓ కుటుంబం కథతో అర్థవంతంగా సాగేచిత్రమిదన్నారు. 
 
ఉమ్మడి కుటుంబాల గొప్పతనాన్ని దర్శకుడు సతీష్ సినిమాలో హృద్యంగా ఆవిష్కరించారు. పల్లెటూరి మధురజ్ఞాపకాల్ని ప్రతి ఒక్కరికి గుర్తుకుతెస్తుంది. మిక్కీ.జే.మేయర్ స్వరాలకు చక్కటి స్పందన లభిస్తోంది. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న 25వ చిత్రమిదని వెల్లడించారు. ప్రకాష్‌రాజ్, జయసుధ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: మధు, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments