Webdunia - Bharat's app for daily news and videos

Install App

సందేశం, వినోదం కలిసి సినిమా సర్కారు నౌకరి ; మూవీ టీమ్

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2023 (18:12 IST)
Akash - Bhavana - Ganganamoni Shekhar
ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా "సర్కారు నౌకరి". ఈ చిత్రంలో భావన హీరోయిన్ గా నటించింది. సర్కారు నౌకరి చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మించారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన "సర్కారు నౌకరి" సినిమా న్యూఇయర్ సందర్భంగా జనవరి 1న థియేటర్స్ లో ఘనంగా విడుదలవుతోంది. ఈ సినిమాను ఇవాళ పాత్రికేయ మిత్రుల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ లో ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం మూవీ టీమ్ మీడియాతో మాట్లాడారు. 
 
దర్శకుడు గంగనమోని శేఖర్ మాట్లాడుతూ - "సర్కారు నౌకరి" కంటెంట్ ఓరియెంటెడ్ గా సాగే సినిమా. యదార్థ ఘటనల స్ఫూర్తితో 90వ దశకం నేపథ్యంలో ఈ మూవీని రూపొందించాను. సందేశం, వినోదం రెండు కలిసి సినిమా "సర్కారు నౌకరి". అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం. అప్పటి గ్రామీణ వాతావరణంలో ఆహ్లాదకరంగా కథా కథనాలు ఉంటాయి. రియలిస్టిక్ అప్రోచ్ తో మూవీ ఆకట్టుకుంటుంది. అన్నారు
 
హీరోయిన్ భావన మాట్లాడుతూ - "సర్కారు నౌకరి" లాంటి మంచి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం కావడం హ్యాపీగా  ఉంది. పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ గా నా క్యారెక్టర్ ఉంటుంది. "సర్కారు నౌకరి" సినిమా ప్రతి ఆడియెన్ కు నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం. మనసును తాకే ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ కథలో ఉన్నాయి. ఇలాంటి మంచి మూవీని మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అని చెప్పింది.
 
హీరో ఆకాష్ మాట్లాడుతూ - "సర్కారు నౌకరి" మూవీ మా కెరీర్ కు ఫస్ట్ స్టెప్. కొత్త ఏడాదిలో మొదటి రోజు మీ ముందుకు వస్తోంది. ఈ మొదటి అడుగులోనే ప్రేక్షకులు విజయాన్ని అందించి బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాం. "సర్కారు నౌకరి"లో ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో మీకు కనిపిస్తాను. సొసైటీకి మంచి చేయాలనే తాపత్రయం ఒకవైపు, కుటుంబం, స్నేహితుల నుంచి ఎదుర్కొనే సంఘర్షణ మరోవైపు నా క్యారెక్టర్ కు అన్ని ఎమోషన్స్ తీసుకొస్తాయి. "సర్కారు నౌకరి" సినిమాకు మీరు ఇచ్చే రెస్పాన్స్ కోసం వేచి చూస్తున్నాం.అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments