Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు వారి పాట మే7న హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్- ట్విట్టర్‌లో ట్రెండ్ సెట్ చేసిన ఎమోజి

Webdunia
గురువారం, 5 మే 2022 (14:53 IST)
Mahesh Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అంచనాలని మరో స్థాయికి తీసుకెళ్లింది సర్కారు వారి పాట థియేట్రికల్ ట్రైలర్. అభిమానులలతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులని అలరించిన సర్కారు వారి పాట  ట్రైలర్.. సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా ? అనే ఆసక్తిని డబల్ చేసింది.
 
ప్రస్తుతం ప్రమోషన్స్ లో దూసుకెళ్తున్న  సర్కారు వారి పాట టీం నుండి మరో అదిరిపోయే ప్రకటన వచ్చింది. సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లేస్, డేటుని ఖరారు చేసింది చిత్ర యూనిట్. మే 7న హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో 'సర్కారు వారి పాట' గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఫ్యాన్స్ భారీగా వచ్చి ఈవెంట్ ని ప్రత్యేక్షంగా ఎంజాయ్ చేసే విధంగా చిత్ర యూనిట్ ఓపెన్ గ్రౌండ్‌ను ఎంచుకుంది. 
సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంటున్న ఈ ఈవెంట్ లో ప్రేక్షకులకు చాలా సర్ప్రైజ్ లు వుండబోతున్నాయి.
 
ఇదిలా వుంటే ఇప్పటికే ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజులు ఇచ్చిన సర్కారు వారి పాట టీం.. ఇప్పుడు మరో గ్రేట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. నిన్న అభిమానుల కోసం ఒక సర్ప్రైజ్‌ ను వెల్లడిస్తానని ప్రకటించి చిత్ర యూనిట్, చెప్పినట్లే 'సర్కారు వారి సూపర్ సర్ప్రైజ్' అందించింది. సర్కారు వారి పాట ట్విట్టర్ ఎమోజీతో అభిమానులని సర్ ప్రైజ్ చేసింది. ట్విట్టర్‌లో ఒక రీజినల్ మూవీ ప్రత్యేకమైన ఎమోజీని కలిగి ఉండటం ఇదే తొలిసారి. ఇంతకుముందు, కెజిఎఫ్ 2, సాహో వంటి పాన్ ఇండియన్, మల్టీ లాంగ్వేజ్ చిత్రాలకు మాత్రమే ఎమోజి ఉండేది.
 
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్, సర్కారు వారి పాట సినిమాపై వున్న భారీ హైప్ నేపధ్యంలో ట్విట్టర్ టీమ్ ఎమోజిని యాక్టివేట్ చేసింది. సినిమా టైటిల్ హ్యాష్‌ట్యాగ్‌ లతో సర్కారు వారి ఎమోజి ని వాడటం ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులని అలరిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments