Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారాల్లో వైలెంట్ గా వుండే సూర్య కథే సరిపోదా శనివారం !

డీవీ
శనివారం, 6 జులై 2024 (12:01 IST)
Nani second look
'సరిపోదా శనివారం' మేకర్స్ ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ సూర్య గా నేచురల్ స్టార్ నానిని ఎగ్రెసివ్ కుర్రాడిగా ప్రజెంట్ చేసింది. అయితే తను శనివారాల్లో మాత్రం వైలెంట్ గా ఉంటాడు. మిగతా రోజులలో సూర్య కొత్త డైమెన్షన్ ని ప్రెజెంట్ చేస్తూ సెకండ్ లుక్‌ను రిలీజ్ చేశారు.
 
నాని ఈ పోస్టర్‌లో బాయ్- నెక్స్ట్-డోర్ అవతార్‌లో బైక్ నడుపుతూ చిరునవ్వుతో కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ఫస్ట్ సింగిల్‌లో సూర్య కనిపించిన తీరుకు ఇది కంప్లీట్ డిఫరెంట్ గా వుంది. ఈ యూనిక్ అడ్రినలిన్‌తో నిండిన అడ్వంచర్ లో క్యారెక్టర్ కి డిఫరెంట్ షేడ్స్ వున్నాయి.
 
వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లతో ముందుకు వస్తారు.
 
డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ నటిస్తుండగా, ఎస్‌జె సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు.
 
మురళి జి డీవోపీ కాగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. 
 
ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

కన్నబిడ్డ నామకరణానికి ఏర్పాట్లు... అంతలోనే తండ్రి హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments